Vijayawada: ఇంద్రకీలాద్రిలో శాకంబరీ ఉత్సవాలు...
ABN, Publish Date - Jul 19 , 2024 | 08:56 AM
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. వివిధ రకాలైన పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేస్తారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి (Kanakadurga Ammavaru) దేవస్థానంలో శుక్రవారం ఉదయం శాకంబరీ ఉత్సవాలు (Sakambari Festivals) ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. వివిధ రకాలైన పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేస్తారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఆలయంలోని దేవతామూర్తులు, ఆలయ ప్రాంగణం అంత వివిధ కూరగాయలతో అలంకరణ చేస్తారు. ప్రతి ఏడాది ఆషాడమాసంలో శాకంబరీ ఉత్సవాలు జరుగుతాయి.
శాకంబరీ దేవి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి.. కూరగాయలు, ఆకుకూరలుతో ముస్తాబైంది. ఇప్పటి వరకు దాతలు 25 టన్నులకుపైగా ఆకుకూరలు, కూరగాయలు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని తయారుచేసి భక్తులకు వితరణ చేస్తారు. లోకం సస్యశ్యామలంగా, పాడిపంటలతో ఉండడానికి, ఎటువంటి కరువు కాటకాలు రాకుండా ఆషాడమాసంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తారు. శుక్రవారం కావడంతో శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న కనక దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.
కాగా మూడు రోజుల పాటు జరగనున్న శాకంబరీ ఉత్సవాలకు సర్వంసిద్ధమైంది. అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయలతో అందంగా అలంకరించారు. కూరగాయల రాశికి గురువారం ఈవో రామారావు, అర్చకులు పూజలు చేశారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని అమ్మవారిని వేడుకున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ఈ ఉత్సవాల్లో హోమాలు, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. ఉత్సవాల నిమిత్తం పెద ఓగిరాల నుంచి మూడు మెట్రిక్ టన్నులు, గుంటూరు జిల్లా నారా కోడూరు, చేబ్రోలు, తెనాలి నుంచి ఒకటిన్నర మెట్రిక్ టన్నుల కూరగాయలు వితరణగా వచ్చాయి. యడ్లపల్లి, సంగం జాగర్లమూడి నుంచి మూడు మెట్రిక్ టన్నుల నిమ్మకాయలు, గుంటూరు, నూజివీడు, హనుమాన్ జంక్షన్ నుంచి ఆరు మెట్రిక్ టన్నులు, సిద్ధాంతం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు నుంచి ఆరు టన్నులు, విజయవాడ నుంచి 500 కిలోల చొప్పున కూరగాయలు దాతల నుంచి అందాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులను నిండా ముంచిన జగన్ సర్కార్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 19 , 2024 | 08:56 AM