Rain Alert: చంద్రబాబు కళ్ళల్లో నీళ్లు చూశా..: శివరాజ్ సింగ్ చౌహాన్
ABN, Publish Date - Sep 06 , 2024 | 12:36 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం.. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో (Flood affected areas) కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Central Minister Shivraj Singh Chauhan ) పర్యటిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటిస్తున్నారు. విజయవాడ (Vijayawada) పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం.. ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆదేశాల మేరకు వరద నష్టం పరిశీలనకు వచ్చానని.. రైతులు ఎవరు కన్నీరు కార్చ వద్దని.. రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)తో పర్యటించినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు చూశానని.. రైతుల (Farmers) భాధలు తనకు తెలుసునని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వరదల వల్ల పంట మునిగిందని, అరటి, పసుపు, తమలపాకు, వరి. మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, అలాగే కౌలు రైతులు బాగా నష్టపోయారని అన్నారు. వరదలతో రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయం తనకు అర్థమైందన్నారు. సంపూర్ణం పంట నష్టం రైతులపై పడిందని, ఆర్థిక ఇబ్బందుల్లో పడతారని, మోదీ, చంద్రబాబులు కలిసి రైతులకు అండ దండలు అందిస్తున్నారని, పసల్ భీమ యోజన క్రింద ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ రూ. 3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని, కేంద్ర వాటా కూడా ఉందని, రైతులకు ఉపశమనం కల్పించే విధంగా పనిచేస్తామన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిన వెంటనే ఏపీలో వరద పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి వివరిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ప్రజాప్రతినిధుల సమావేశం..
కేంద్రమంత్రి శివరాజ్‍సింగ్ చౌహాన్‌తో ప్రజాప్రతినిధులు విజయవాడలో సమావేశం అయ్యారు. వరద పరిస్థితులపై కేంద్రమంత్రికి ప్రజాప్రతినిధులు వివరించారు. శివరాజ్‍సింగ్‍తో భేటీలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ, తెలంగాణాలో రెండు రోజుల పర్యటన..
కాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించనున్నారు. ఏపీలో విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలోని రైతులతో కేంద్ర మంత్రి చర్చించనున్నారు. తర్వాత తెలంగాణలో ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం... ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకోనున్నారు. సాయంత్రం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కాగా నిన్న విజయవాడ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు, మంత్రులు, రాష్ట్ర అధికారులతో అర్థరాత్రి సమావేశమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బుడమేరును మింగేసిన వైసీపీ నాయకులు..
సజ్జలను అరెస్టు చేస్తే.. అన్నీ బయటకొస్తాయి ..
టీడీపీ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
YCP: అధ్యక్ష బాధ్యతలా.. మాకొద్దు బాబోయ్..
కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ కౌంటర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 06 , 2024 | 12:38 PM