Tiruvuru MLA: టీడీపీ నేతలు బేటీ.. కొలిక్కి వచ్చిన కొలికపూడి వ్యవహారం
ABN, Publish Date - Oct 06 , 2024 | 09:02 PM
తన వ్యవహార శైలిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఇకపై పార్టీలోని పెద్దలతో గతంలో వలే వ్యవహరించనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం తిరువూరులోని శ్రీరస్తూ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు.
విజయవాడ, అక్టోబర్ 06: తన వ్యవహార శైలిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఇకపై పార్టీలోని పెద్దలతో గతంలో వలే వ్యవహరించనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం తిరువూరులోని శ్రీరస్తూ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు 25 మందితో కమిటీ వేస్తామని ఆయన ప్రకటించారు. ఆ కమిటీ నిర్ణయాలు అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: KCR: కేసీఆర్ కనిపించడం లేదు.. ఆచూకీ కోసం..
అధిష్టానం సూచన మేరకు అందరం కలిసి పని చేయాలని పార్టీ శ్రేణులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని సూచించారు. పార్టీకి నష్టం కలిగే విధంగా ఎవరు నడుచుకోవద్దన్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఐదుగురు టీడీపీ నేతలతో ఒక కమిటీ వేసి నిర్ణయాలు తీసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో ఇకపై పార్టీ శ్రేణులను కలుపుకుని వెళ్తానన్నారు.
Also Read: Etela Rrajender: సీఎం రేవంత్‌కి ఎంపీ ఈటల ఘాటు లేఖ
ఇక ఈ నియోజకవర్గంలో అందరిని కలుపుకొని వెళ్తామంటూ సభ వేదికపై తామంతా కలిసి పని చేస్తామని చేయి చేయి కలిపి పార్టీ నేతలు ఈ సందర్బంగా ప్రతిజ్జ చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిశీలకులు చిట్టిబాబు, శావల దేవదత్‌తోపాటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఇక దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈ సమావేశానికి హాజరుకావాలంటూ చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుతోపాటు ఆయన మద్దతుదారులను ఎంపీ కేశినేని శివనాథ్, వర్ల రామయ్య కోరినా.. వారు ఈ సమావేశాన్ని హాజరుకాలేదు.
Also Read: Hyderabad: సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
ఇంతకీ ఏం జరిగింది..?
అమరావతి జేఏసీ నాయకుడి కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యహరించడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావుకు పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Also Read: Canada: వెయిటర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన భారతీయ విద్యార్థులు.. వీడియో వైరల్..!
అయిత ఇటీవల చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారీ ఎమ్మెల్యే కొలికపూడి. దీంతో వ్యవహారం కాస్తా పెద్దదయింది. అలాంటి వేళ.. కొలికపూడి వర్సెస్ నాన్ కొలికపూడి అన్నట్లుగా నియోజకవర్గంలో పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ క్రమంలో వారందరిని ఒక తాటిపైకి తీసుకు వచ్చేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది.
Also Read: Dasara 2024: ఐదో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ
అందులోభాగంగా పార్టీ కీలక నేతలు ఎంపీ కేశినేని చిన్ని, వర్ల రామయ్యను రంగంలోకి దింపింది. దాంతో కొలికపూడి గతంలో వలే పార్టీ నేతలతో వ్యవహరించనని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు అయింది.
For AndhraPradesh News And Telugu News...
Updated Date - Oct 06 , 2024 | 09:02 PM