Bhuvaneshwari: మరోసారి ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. పర్యటన వివరాలు ఇవే...
ABN, Publish Date - Jan 02 , 2024 | 12:43 PM
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో రేపటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. రేపు విజయనగరం జిల్లాలో, ఈనెల నాలుగన శ్రీకాకుళం జిల్లాలో, ఐదున విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు.
అమరావతి, జనవరి 2: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (TDP Chief Chandrababu Wife Nara Bhuvaneshwari) మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో రేపటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. రేపు విజయనగరం జిల్లాలో, ఈనెల నాలుగన శ్రీకాకుళం జిల్లాలో, ఐదున విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. ఇప్పటికే ఒకసారి వెళ్లి కొన్ని కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించిన విషయం తెలిసిందే.
కాగా.. అక్రమంగా అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు విడుదల కోసం సతీమణి భువనేశ్వరి చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. చంద్రబాబు అరెస్ట్ నుంచి రాజమండ్రిలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యారు. చంద్రబాబు విడుదల కోసం చేపట్టిన కార్యక్రమాల్లో భువనేశ్వరి చురుగ్గా పాల్గొన్నారు. ప్రజల్లోనే ఉంటూ.. వారి సాదకబాధలను కూడా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా మనస్థాపంతో చనిపోయిన వారి కుటుంబాలను కూడా భువనేశ్వరి పరామర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 02 , 2024 | 12:43 PM