కొనసాగుతున్న లయోలా వాకర్స్ నిరసన
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:40 AM
ఆంధ్రా లయోలా కళాశాల యాజమాన్యం మొండివైఖరి వదిలి గ్రౌండ్‌లో వాకింగ్‌కు అనుమతించాలని లయోలా వాకర్స్, అమరావతి వాకర్స్ సభ్యులు కోరుతూ శుక్రవారం కళాశాల సమీపంలో ర్యాలీ నిర్వహించారు.
కొనసాగుతున్న లయోలా వాకర్స్ నిరసన
భారతీనగర్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా లయోలా కళాశాల యాజమాన్యం మొండివైఖరి వదిలి గ్రౌండ్‌లో వాకింగ్‌కు అనుమతించాలని లయోలా వాకర్స్, అమరావతి వాకర్స్ సభ్యులు కోరుతూ శుక్రవారం కళాశాల సమీపంలో ర్యాలీ నిర్వహించారు. ఉదయం లయోలా కళాశాల మెయిన్ గేట్ వద్ద కళాశాల యాజమాన్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఆంధ్రా లయోలా వాకర్స్, అమరావతి వాకర్స్ సభ్యులు శాంతియుత నిరసన చేశారు. అనంతరం కళాశాల నుంచి రమేష్ హాస్పిటల్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. కళాశాల యాజమాన్యం వాకింగ్‌కు అనుమతించకపోతే త్వరలో ర్యాలీగా ప్రజాప్రతినిధుల దగ్గరకు బయలుదేరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా లయోలా వాకర్స్, అమరావతి వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 12:40 AM