Missing Case: మచిలీపట్నంలో ముగ్గురు మైనర్ బాలుర మిస్సింగ్ కలకలం..
ABN, Publish Date - Nov 03 , 2024 | 08:42 AM
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు (అన్నదమ్ములు) మిస్సింగ్ అయ్యారు. ఉదయం స్కూల్‌కు అని బయలుదేరినవారు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు మచిలీపట్నం, ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ అయిన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో ముగ్గురు మైనర్ బాలుర మిస్సింగ్ (Three Minor Boys Missing) కలకలం రేగింది. కాలేఖాన్ పేట, మంచినీటి కాలువలో నివశిస్తున్న ఓ యానాది కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు (అన్నదమ్ములు) మిస్సింగ్ అయ్యారు. ఉదయం స్కూల్‌కు అని బయలుదేరినవారు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు (Police) మిస్సింగ్ (Missing) అయిన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన పిల్లలు తుమ్మ శ్రీనివాసులు(3), తుమ్మ దుర్గారావు(6), తుమ్మ శ్రీనివాసులు (8).
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు మాట్లాడుతూ..
మిస్సింగ్ అయిన ముగ్గురు మైనర్ పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. గాలింపు చర్యల కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పిల్లల బంధువులతో కలిసి పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టామని, అతి తక్కువ సమయంలోనే అదృశ్యమైన పిల్లల ఆచూకీ గుర్తించే దిశగా కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
కాగా మూడేళ్ల క్రితం తప్పిపోయిన బాలుడిని విజయవాడకు చెందిన ఎస్‌కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్టు వారు అతని తల్లిదండ్రులకు అప్పగించారు. దోమ గ్రామానికి చెందిన బొక్క బాబు, యాదమ్మల కుమారుడు భరత్‌కుమార్ పదేళ్ల వయసులో తప్పిపోయాడు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో తల్లి వెంబడి భరత్‌కుమార్ హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ అతడు తప్పిపోయాడు. వారు నిరక్షరాస్యులు కావడంతో ఎలాంటి ఫిర్యాదు అందించలేదు. మూడేళ్ల క్రితం బాలుడు విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా కనిపించడంతో విజయవాడకు చెందిన ఎస్‌కేసీవీ సంస్థ ప్రతినిధులు ఆ బాలుడిని చేరదీశారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పిల్లలు తమ సొంత గ్రామం, తల్లిదండ్రుల పేర్లు తెలపడంతో వారి సొంత గ్రామానికి చేర్చి ప్రజాప్రతినిధులు, పోలీసుల ఆధ్వర్యంలో పిల్లలను అప్పజెబుతారు. ఈ క్రమంలో దోమ మండల కేంద్రానికి వచ్చిన ట్రస్టు ప్రతినిధులు భరత్‌కుమార్‌ను తండ్రి బొక్క బాబుకు అప్పజెప్పారు. అదే విధంగా బాలుడిని ఏదైనా పాఠశాలలో చేర్పించాలని మాజీ సర్పంచ్ రాజీరెడ్డి కోరగా అందుకు వారు స్పందించి సంబంధిత అధికారుల ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలో తండ్రి అనుమతితో చేర్పిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజీరెడ్డి ట్రస్టు సభ్యులను అభినందించారు. ఈ ఘటన మూడు వారాల క్రితం జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌ను శిక్షించాలా.. వద్దా..: సీఎం చంద్రబాబు
వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 03 , 2024 | 08:42 AM