AP Assembly: ప్రొటెం స్పీకర్‌ను ఎందుకు ఎన్నుకుంటారు.. స్పీకర్‌కు ఉండే హక్కులు ఉంటాయా..!
ABN, Publish Date - Jun 19 , 2024 | 05:19 PM
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజులపాటు సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రొటెం స్పీకర్ అనే పదం ఎక్కువుగా వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజులపాటు సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రొటెం స్పీకర్ అనే పదం ఎక్కువుగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో రాష్ట్రపతి (President), రాష్ట్రాల్లో గవర్నర్ (Governor) రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తారు. ఎంపీలతో రాష్ట్రపతి లేదా వారిచే నియమితులైన ప్రతినిధి, ఎమ్మెల్యేలతో గవర్నర్ లేదా వారితో నియమితులైన ప్రతినిధి ప్రమాణ స్వీకారం చేయించాలని నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ ఎమ్మెల్యేల్లో ఒకరిని తన ప్రతినిధిగా నియమిస్తారు. కొత్త శాసనసభకు స్పీకర్ ఎన్నిక జరిగేవరకు గవర్నర్ నియమించిన వ్యక్తి ఆ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తిస్తారు. రాజ్యాంగబద్ధంగా స్పీ్కర్‌కు ఉండే అన్ని అధికారాలు ప్రొటెం స్పీకర్‌కు ఉండవు. పరిమితులకు లోబడి మాత్రమే తన విధులను నిర్వహించాల్సి ఉంటుంది.
Parthasarathy: జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
ప్రొటెం స్పీకర్ అంటే..
ప్రొటెం స్పీకర్ ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజ్యాంగం ప్రకారం శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు విధిగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. గవర్నర్ లేదా వారిచేత నియమితులైన ప్రతినిధి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించవచ్చనే వెసులుబాటు ఉంది. దీంతో గవర్నర్ తన ప్రతినిధిగా ఒకరిని ఎంపిక చేస్తారు. వారు స్పీకర్ స్థానంలో తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు. దీంతో వారిని ప్రొటెం స్పీకర్‌గా పిలుస్తారు.. అలాగే ప్రొటెం స్పీకర్ అనేదానికి తాత్కాలిక లేదా, ప్రస్తుతానికి అనే అర్థం కూడా వస్తుంది. ఎవరినైతే ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ నియమిస్తారో వారు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రొటెం స్పీకర్ ఎవరుండాలనేదానిపై సాధారణంగా ముఖ్యమంత్రితో చర్చించి శాసనసభ వ్యవహారాల శాఖమంత్రితో నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో గవర్నర్ తన విచక్షణ ఆధారంగా ప్రొటెం స్పీకర్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు.
Gorantla Butchaiah Chowdary: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. ఫోన్ చేసి చెప్పిన పయ్యావుల
ఎవరిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు..
ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని పెట్టాలనేదానిపై నిర్థిష్టమైన నిబంధనలు ఏమి లేవు. కానీ సభలో సీనియర్ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలనేది ఓ సంప్రదాయంగా వస్తోంది. సభ్యుడి వయసు ఆధారంగా కాకుండా.. ఎన్నిసార్లు శాసనసభకు ఎన్నికయ్యారనేదాని ఆధారంగా సీనియార్టీని నిర్ణయిస్తారు. ప్రస్తుత శాసనసభలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ఏదైనా సందర్భంలో సీనియర్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇతర రాజ్యాంగబద్ధ పదవులు లేదా కేబినెట్‌లో భాగస్వామిగా ఉంటే ఆ తరువాత సీనియర్‌గా ఉన్న ఎమ్మెల్యేను నియమిస్తారు. ఒకవేళ సీనియర్‌గా ఉన్న వ్యక్తి తాను ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించడానికి విముఖత చూపితే ఆయన తరువాత స్థానంలో ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటారో వారిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. 16వ శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు సీనియర్ కాగా.. ఆయన సీఎంగా ఉండటంతో ఆయన తరువాత స్థానంలో సీనియర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంటల బుచ్చయ్యచౌదరి ఉన్నారు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో బుచ్చయ్యచౌదరి పేరును ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈనేపథ్యంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బుచ్చయ్య చౌదరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఆయన మిగతా ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు. కొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకు ప్రొటెం స్పీకర్ తన తన బాధ్యతల్లో కొనసాగుతారు.
Pawan Kalyan: పవన్ తొలి సంతకం ఆ పెన్నుతోనే.. ఎవరిచ్చారంటే..?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jun 19 , 2024 | 05:20 PM