ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: అడ్డొచ్చిన పోలీసులను ప్రేమోన్మాది ఏం చేశాడంటే?

ABN, Publish Date - Jul 18 , 2024 | 01:09 PM

Andhrapradesh: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఓ ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. అడ్డొచ్చినపోలీసులపై కూడా చేయి చేసుకున్నాడు. అంతే కాదు స్టేషన్లోని సామాగ్రిని కూడా ధ్వంసం చేసి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. జాన్ హెన్రీ అనే యువకుడు గత కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.

Gudivada

కృష్ణా జిల్లా, జూలై 18: సమాజంలో ప్రేమోన్మాదుల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. ప్రేమించడం లేదనే కారణంతో యువతిపై దాడి చేయడం, ఇంకో ముందడగేసి ఏకంగా ప్రాణాలు తీయడం చేస్తుంటారు కొందరు. మరికొందరు యువతుల ప్రాణాలతో పాటు తమ ప్రాణాలను కూడా తీసుకుంటుంటారు. అలాగే యువతి కుటుంబసభ్యులను కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు. ఒకవేళ ఈ వ్యవహారం పోలీసుల (AP Police) వరకు వెళ్లిందంటే... ఇక ఆ ప్రేమ్మోన్మాదులు మరింత రెచ్చిపోతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ ప్రేమ్మోన్మాది ఏకంగా పోలీసులకే ఎదురు తిరిగి.. కటకటాలపాలయ్యాడు.

Budda Venkanna: మీడియాపై విజయసాయి వ్యాఖ్యలు సిగ్గుచేటు..


కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో (Gudivada) ఓ ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా చేయి చేసుకున్నాడు. అంతే కాదు స్టేషన్లోని సామాగ్రిని కూడా ధ్వంసం చేసి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. జాన్ హెన్రీ అనే యువకుడు గత కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలియజేసింది. తమ కూతురు జోలికి రావొద్దన్న యువతి పేరెంట్స్‌పై యువకుడు దాడి చేయబోయాడు.

Ayyanna Patrudu: జగన్ కట్టించిన గోడ.. స్పీకర్ ఏం చేశారంటే..


విషయం తెలిసిన టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో రెచ్చిపోయిన యవకుడు... స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాడు. ల్యాండ్ లైన్ ఫోన్, వాకీ టాకీ, పూల కుండీలను నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు. ఆపేందుకు యత్నించిన పోలీసులను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. ఈ క్రమంలో జాన్ హెన్రీపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి...

Mashco Piro: కెమెరాకు చిక్కిన ‘మాష్కో పిరో’ ఆటవిక తెగ ప్రజలు.. అరుదైన ఫొటో, వీడియోలు ఇవిగో

Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 01:17 PM

Advertising
Advertising
<