YSRCP: ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా కూటమి బడ్జెట్.. సర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్సీ విసుర్లు
ABN, Publish Date - Nov 11 , 2024 | 04:50 PM
Andhrapradesh: ఎన్నో పథకాలు ఇస్తామని దేనికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని వైసీపీ ఎమ్మెల్యే కళ్యాణి విమర్శలు గుప్పించారు. ప్రజలను కూటమి ప్రభుత్వం నిట్టనిలువుగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏటా 20 వేలు ఇస్తామన్నారని.. కేవలం రూ.5 వేల కోట్లే నిధులు పెట్టారన్నారు. తల్లికి వందనం పథకం కోసం కేవలం రూ.5300 కోట్లు కేటాయించారని..
అమరావతి, నవంబర్ 11: ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శలు గుప్పించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఏడు నెలల పాటు ఒటాన్ బడ్జెట్ అమలు చేసి దేశ చరిత్రలోనే ఎవరూ చేయని చెత్తరికార్డును కూటమి ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా కూటమి బడ్జెట్ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నో పథకాలు ఇస్తామని దేనికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. ప్రజలను కూటమి ప్రభుత్వం నిట్టనిలువుగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏటా 20 వేలు ఇస్తామన్నారని.. కేవలం రూ.5 వేల కోట్లే నిధులు పెట్టారన్నారు. తల్లికి వందనం పథకం కోసం కేవలం రూ.5300 కోట్లు కేటాయించారని.. ఇది ఏ మూలకూ సరిపోదని అన్నారు.
Supreme CJI: సక్సెస్ అంటే ఇదీ.. పోగొట్టుకున్న చోటే సాధించారు..జస్టిస్ ఖన్నా రియల్ స్టోరీ
సగం సగం కేటాయించి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు నెలకు 1500 ఇస్తామన్న మహాశక్తి పథకానికి నిధులు కేటాయింపులు లేవన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని.. నిధులు ఎక్కడ అని ప్రశ్నించారు. ఉచిత బస్సు కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని.. ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెనకు నిధులు లేవన్నారు. వాలంటీర్లకు గౌరవం వేతనం రూ.10 వేలకు పెంపు లేదన్నారు. రైతుల పంటలకు ధరల స్థిరీకరణ నిధికి నిధులు ఎక్కడ అని ప్రశ్నించారు. లారీ, ఆటో, టాక్సీ డ్రైవర్లకు, మత్స్యకారుల భరోసా పథకానికి నిధులు ఎక్కడ అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని.. ప్రజలను నిట్టనిలువుగా మోసం చేశారని వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు వైసీపీ పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.
AP Assembly: జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే
ఖచ్చితంగా ఇవ్వాల్సిందే: చంద్రశేఖర్
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను వైసీపీ బయటకు తీసుకువచ్చిందని ఆ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని టీడీపీ కూటమి ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో అప్పులపై టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదకొండు మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు అనే దానిపై తప్పుడు భాష్యం చెబుతున్నారన్నారు. రూ.57 కోట్లు ప్రభుత్వం ఎందుకు అప్పు చేసిందని ప్రశ్నించారు. అప్పులు ఏ రంగాలకు, పథకాలకు ఉపయోగిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళపై దాడులు చేస్తున్నారని... ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీ అసెంబ్లీలో బయట పడుతుందని వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని.. వైసీపీకి ప్రతిపక్ష హోదా కచ్చితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా
Anangani: ఎన్నికల హామీల అమలుకు అద్దం పట్టే బడ్జెట్ ఇది
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 11 , 2024 | 04:56 PM