YSRCP: జగన్ అడ్డంగా దొరికేశారా.. కవరింగ్ కోసం ఎన్ని వేషాలో..
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:49 PM
వైసీపీ అసమర్థ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. దీనికి ప్రతిఫలంగా ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో జగన్ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలను శాసనసభ ద్వారా ప్రజల ముందు పెడుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం..
వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎంత అస్తవ్యస్తంగా పాలించారో కూటమి ప్రభుత్వం ఆధారాలతో బయటపెడుతోంది. అభివృద్ధిలో రాష్ట్రం ఏ విధంగా వెనుకపడింది.. యువత, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలను జగన్ ఎంత మోసం చేశారు.. వైసీపీ అసమర్థ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. దీనికి ప్రతిఫలంగా ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో జగన్ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలను శాసనసభ ద్వారా ప్రజల ముందు పెడుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం ఎంత మందకొడిగా సాగింది. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని ఏ విధంగా రాష్ట్రాన్ని అధోగతి పట్టించారనే విషయాన్ని చర్చల ద్వారా ప్రభుత్వం ప్రజలకు తెలియజేస్తోంది. దేశంలో అద్భుత పాలన అంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతల బండారాన్ని కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది. జగన్ దుర్మార్గపు ఆలోచనలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్రాన్నికి ఎంతో నష్టం చేశారని సీఎం చంద్రబాబు శాసనసభ సాక్షిగా తెలిపారు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ పాలనలో ప్రతిరోజు అప్పుల కోసం వెంపర్లాడే పరిస్థితులు ఉండేవి. పరిశ్రమల ఏర్పాటుపై ఎటువంటి దృష్టి పెట్టలేదు. ఫలితంగా రాష్ట్రానికి ఆదాయం రాకపోగా.. అప్పులు పెరిగాయనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తన పాలనలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కవరింగ్ కోసం..
తన తప్పులు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు జగన్ కష్టపడుతున్నారట. ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలైనా పూర్తికాకముందే కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడంతో పాటు.. పాలన సరిగ్గా లేదని ప్రచారం చేస్తే.. ప్రభుత్వం చెప్పే అంశాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటాయనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. తమ అసత్య ప్రచారాల చుట్టూ ప్రజల దృష్టిపెట్టేలా చేస్తూ ఐదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన అక్రమాలు, తప్పులపై ప్రజల్లో చర్చ జరగకుండా తప్పించుకోవచ్చనే ఓ దుర్మార్గపు ఆలోచనలో వైసీపీ అధ్యక్షులు జగన్ ఉన్నారనే చర్చ జరుగుతోంది. తన తప్పులను కవరింగ్ చేసుకోవడం కోసం ఇతరులపై అసత్యాలు ప్రచారం చేయడాన్ని ఓ పనిగా వైసీపీ పెట్టుకుందనే అనుమానాలను కూటమి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ చేసిన అక్రమాలు, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలను ప్రజల ముందు పెడతామని కూటమి నేతలు చెబుతున్నారు.
అడ్డంగా దొరికేశారా..
గత ప్రభుత్వంలో అవగాహన లేమితో, కక్షపూరితంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా జరిగిన నష్టంపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సమగ్ర దర్యాప్తుతో అడ్డంగా దొరికిపోయామని గ్రహించిన వైసీపీ ప్రజల దృష్టి మరల్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందనే చర్చ జరుగుతోంది. సీఎంగా ఉన్న సమయంలో ఏడాదికి ఒకసారి కూడా మీడియా ముందుకు రాని జగన్.. ప్రస్తుతం వారానికోసారి వచ్చి అబద్ధాలు చెప్పేందుకు మీడియా ముందుకు వస్తున్నారంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. చివరికి తన తప్పులను కవర్ చేసుకునేందుకు జగన్ మాత్రం తెగ కష్టపడుతున్నారట.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 20 , 2024 | 01:49 PM