TDP: గంటా రాజీనామా విషయంలో స్పీకర్ ఇన్నాళ్లూ పడుకున్నారా..?: కూన రవికుమార్ ఫైర్
ABN, Publish Date - Jan 24 , 2024 | 01:12 PM
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను మూడేళ్ల తర్వాత స్పీకర్ తమ్మినేని ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నేడు టీడీపీ నేత కూన రవికుమార్ ఫైర్ అయ్యారు.
అమరావతి: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను మూడేళ్ల తర్వాత స్పీకర్ తమ్మినేని ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నేడు టీడీపీ నేత కూన రవికుమార్ ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గంటా రాజీనామా విషయంలో స్పీకర్ తమ్మినేని ఇన్నాళ్లూ పడుకున్నారా..? అని ప్రశ్నించారు. రాజీనామా ఆమోదించే ముందు సభ్యుని వివరణ తీసుకోవాలని కానీ ఆ నిబంధన పాటించలేదన్నారు.
అసెంబ్లీలో ఏ ఒక్క రోజూ నిబంధనలను పాటించింది లేదని కూన రవికుమార్ అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదించారన్నారు. ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని చీటి చించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తమ్మినేని అన్నారు.
Updated Date - Jan 24 , 2024 | 01:30 PM