బీఎల్‌వోలు బాధ్యతగా పని చేయాలి: ఈ ఏఎస్‌వో
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:57 AM
బీఎల్‌వోలు బాధ్యతగా పని చేయాలని ఈఏఎస్‌వో (ఎలక్షన్ అసిస్టెంట్ సెక్షన్ అధికారి) చిన్న వెంకటేశ్వర్లు అన్నారు.
నంద్యాల రూరల్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): బీఎల్‌వోలు బాధ్యతగా పని చేయాలని ఈఏఎస్‌వో (ఎలక్షన్ అసిస్టెంట్ సెక్షన్ అధికారి) చిన్న వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్‌వోల పనితీరును ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల విభాగం ఆదేశాల మేరకు పోలింగ్ భూతులలో ఓటర్ల నమోదుకు, మార్పులు, చేర్పులు, అక్షర దోషాలు నివారణ, అభ్యంతరాలపై వచ్చే దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలన్నారు. తుది నివేదికలను ప్రభుత్వానికి సమర్పించే నాటికి ఎలాంటి లోపాలు లేకుండా పంపిచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే పోలింగ్ భూతులలో వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ర్యాంప్‌ల ఏర్పాట్లపై, అవసరమైన వసతుల కల్పనకు ఉండాల్సిన సదుపాయాలపై ఆరాతీశారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రియదర్శిని, ఎలక్షన్ డీటీ విజయశేఖర్ తదితరులు ఉన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 12:57 AM