ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kurnool: బన్నీ ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు..

ABN, Publish Date - Oct 13 , 2024 | 07:09 AM

దేవరగట్టులో శ్రీ మాల మల్లేశ్వర స్వామి మల్లమ్మల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ఉత్సవ మూర్తులను కొండ మీద ఆలయం నుంచి కిందకు తీసుకొచ్చారు. బన్నీ జైత్రయాత్ర సింహాసనం కట్ట వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు భక్తులు కర్రలతో కొట్టుకున్నారు.

కర్నూలు జిల్లా: దేవరగట్టు (Devaragattu)లో శ్రీ మాల మల్లేశ్వర స్వామి (Sri Mala Malleswara Swami) మల్లమ్మల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ఉత్సవ మూర్తులను కొండ మీద ఆలయం నుంచి కిందకు తీసుకొచ్చారు. బన్నీ జైత్రయాత్ర (Bunny Pilgrimage) సింహాసనం కట్ట వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు భక్తులు కర్రలతో కొట్టుకున్నారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టులో తీవ ఉద్రిక్తత నెలకొంది. బందోబస్తుకు వచ్చిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. జైత్రయాత్రలో అల్లరి మూకలు కాగడాలు పైకి విసిరారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. కాగా దేవరగట్టులో ఫ్లెక్సీ హోర్డింగు కూలింది.


కాగా దసరా పండుగ సందర్భంగా శనివారం దేవరగట్టు మాలమల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవానికి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 800 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో ఏడుగురు డీఎస్పీలు, 42 మంది సీఐలు, 54 మంది ఎస్‌ఐలు, 112 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 362 మంది కానిస్టేబుళ్లు, 50 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు, 3 ప్లటూన్ల ఏఆర్‌ పోలీసులు, 95 మంది హోంగార్డులు బన్ని ఉత్సవం బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. 100 నైట్‌ విజన్‌ సీసీ కెమెరాలు, 700 ఎల్‌ఈడీ లైట్లు, 5 డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.


అలాగే దేవరగట్టు పరిసర గ్రామాల్లో కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు 148 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. 4 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ మద్యం, నాటుసారా కట్టడికి గట్టి చర్యలు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి నిబంధనలు ఉల్లంఘించి, అల్లర్లు, నిప్పులు విసరడం వంటివి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. దేవరగట్టు చుట్టుపక్కల నెరణికి, కొత్తపేట, అరికేర, ఎల్లార్తి గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో అవగాహన సదస్సులు నిర్వహించారు. దేవరగట్టు పరిసర గ్రామాల్లో ప్రధాన రహదారుల్లోనే గాకుండా చిన్న చిన్న దారుల్లోనూ బందోబస్తులు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఉత్సవంలో ఫైర్‌ సిబ్బంది, వైద్యసిబ్బంది, అంబులెన్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ట్వీట్..

రావణదహనానికి విల్లుపట్టిన ముర్ము, మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 13 , 2024 | 07:09 AM