‘పది’ పరీక్షలో 975 మంది గైర్హాజర్
ABN , Publish Date - May 27 , 2024 | 11:35 PM
పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు సోమవారం 975 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో శామూయేల్ తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), మే 27: పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు సోమవారం 975 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో శామూయేల్ తెలిపారు. జిల్లాలో మొత్తం 2107 మంది రిజిస్టర్ చేసుకోగా.. 1132 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. ఇందులో 975 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లాలోని 22 పరీక్ష కేంద్రాలను డీఈవో శామూయేల్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 17 పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించాయి. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదు. అలాగే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షకు జిల్లాలో 10,601 మంది రిజిస్టర్ చేసుకోగా.. ఇందులో 10,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 414 మంది గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షకు 3218 మంది రిజిస్టర్ చేసుకోగా, 3049 మంది పరీక్షకు హాజరయ్యారు. 169 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో ఎస్‌వీఎస్ గురువయ్య శెట్టి తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదు.