ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: నంద్యాల జిల్లా: శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం

ABN, Publish Date - Feb 16 , 2024 | 07:46 AM

నంద్యాల జిల్లా: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రూ.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం మల్లన్నకు కానుకగా సమర్పిస్తారు.

నంద్యాల జిల్లా: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రూ.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం మల్లన్నకు కానుకగా సమర్పిస్తారు. సంప్రోక్షణ అనంతరం రథశాల నుంచి నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, వేమిరెడ్డి దంపతులు పాల్గొననున్నారు. బంగారు రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు కొలువుదీరాయి. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులు, ముందుభాగంలో రెండు పెద్ద అశ్వాలు స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు.

శ్రీశైలం దేవస్థానానికి తొలిసారిగా స్వర్ణరథం సమకూరింది. ఇప్పటివరకు స్వామి, అమ్మవార్లకు వెండిరథంపైనే ఊరేగిస్తున్నారు. దాతలు శుక్రవారం ఈ రథాన్ని దేవస్థానానికి అప్పగించిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దానిని ప్రారంభిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు.

కాగా శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం నుంచి ఈనెల 21 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈరోజు మంత్రి కొట్టు సత్యనారాయణ సంకల్పం చేయనున్నారు. 21న శాంతిహోమం, పౌష్టిక హోమం, మహా పూర్ణాహుతి, పునరుద్ధరించిన ఆలయాల్లో యంత్ర ప్రతిష్ఠలు, శివలింగ, నందీశ్వరుల ప్రతిష్ఠ, శివాజీ గోపురంపై సువర్ణ కలశ ప్రతిష్ఠ, విమాన గోపురాలు, ప్రధాన గోపురాలు, మూలమూర్తులు, ఇతర దేవతామూర్తులకు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.

Updated Date - Feb 16 , 2024 | 07:46 AM

Advertising
Advertising