వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:34 PM
నగరంలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళానిలయం నిర్వాహకురాలు బి. నాగమల్లేశ్వరమ్మ శిష్య బృందం నిర్వహించిన సామూహిక గీతా పారాయణం కార్యక్రమానికి వండల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది.
కర్నూలు కల్చరల్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): నగరంలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళానిలయం నిర్వాహకురాలు బి. నాగమల్లేశ్వరమ్మ శిష్య బృందం నిర్వహించిన సామూహిక గీతా పారాయణం కార్యక్రమానికి వండల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. శనివారం నగరంలోని సంకల్‌బాగ్‌లోని గీతా ప్రచార ధామం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 155 మంది చిన్నారులు భగవద్గీతలోని 47 శ్లోకాలు సామూహికంగా పారాయణం చేసి ఒక రికార్డును నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి చిన్నారులకు శిక్షణ ఇచ్చిన బి. నాగమల్లేశ్వరమ్మకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు నిర్వాహకులు మెడల్‌తోపాటూ ధ్రువీకరణ పత్రం అందజేసి సత్కరించారు.
Updated Date - Dec 21 , 2024 | 11:34 PM