ఎమ్మిగనూరు ఎంఈవోపై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Dec 23 , 2024 | 11:53 PM
విద్యార్థినిపై చేయి చేసుకున్న ఎమ్మిగనూరు ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విద్యార్థిని తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జాయింట్ కలెక్టర్‌కు బి.నవ్యకు వినతిపత్రం అందజే శారు.
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థినిపై చేయి చేసుకున్న ఎమ్మిగనూరు ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విద్యార్థిని తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జాయింట్ కలెక్టర్‌కు బి.నవ్యకు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలం పర్లపల్లె గ్రామంలోని జడ్పీహెచఎస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పై ఎంఈవో-2 మధుసూదనరాజు, డిసెంబరు 11వ తేదీన చేయి చేసుకున్నా డని అన్నారు. ఆయనపై ఈ నెల 16న డిప్యూటీ డీఈవో వెంకటరమణారెడ్డికి ఫిర్యాదు చేశామన్నారు. డిప్యూటీ డీఈవో విచారణ చేసి ఆరు రోజులవుతున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్ ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, అమర్, సాయి ఉదయ్, ఆర్యన పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 11:53 PM