ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లక్ష్యంతో చదవాలి: డీఈవో

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:07 AM

లక్ష్యంతో చదవాలని డీఈవో జనార్దన్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

నందికొట్కూరు రూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): లక్ష్యంతో చదవాలని డీఈవో జనార్దన్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో శుక్రవారం మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలను, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సరైన సమయానికి పాఠశాలకు రావాలని, ప్రతిరోజు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి విషయంలో గమనిస్తూ ఉండాలన్నారు. సమయానికి పాఠశాలకు పంపే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. పేరెంట్స్‌ మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాల అభివృద్ధికి అందరూ తోడ్పాటనందిం చాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాసులు, హెచ్‌ఎం మద్దిలేటి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:07 AM