ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి పనులకు భూమి పూజ

ABN, Publish Date - Oct 04 , 2024 | 12:41 AM

భక్తుల వసతి కల్పనలో భాగంగా మహానంది క్షేత్రంలో రూ.79 లక్షలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం భూమి పూజ నిర్వహించారు.

నిశ్చితార్థ మండప నిర్మాణాన్ని భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే

మహానంది, అక్టోబరు 3: భక్తుల వసతి కల్పనలో భాగంగా మహానంది క్షేత్రంలో రూ.79 లక్షలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం భూమి పూజ నిర్వహించారు. ఆలయ రెండవ ప్రాకారంలో దేవదాయశాఖ నిధులతో రూ.55 లక్షలతో నిర్మిస్తున్న కోనేరు ఆధునికీకరణ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అలాగే దాతల సహకారంతో రూ.24 లక్షలతో నిర్మిస్తున్న నిశ్చితార్థ మండప నిర్మాణానికి భూమి పూజతో పాటు నవరాత్రి ఉత్సవాల సందర్బంగా మహానందికి చెందిన భవనాశి రమణయ్య, మంజులావాణి దంపతులు నిర్మించిన యాగశాల మంటపాన్ని ఎమ్మెల్యే బుడ్డా ప్రారంభించారు. అంతకుముందు మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల ఆకస్మాత్తుగా మృతి చెందిన మహానందికి చెందిన టీడీపీ నాయకుడు సూరే శ్రీనివాసులు గృహానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఏఈవో వై. మధు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరి రామలింగారెడ్డి, టీడీపీ నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి, గడ్డం నాగపుల్లయ్య, శ్యామల జనార్దన్‌రెడ్డి, గంగిశెట్టి మల్లికార్జునరావు, క్రాంతికుమార్‌, మారెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 12:41 AM