విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ABN, Publish Date - Dec 08 , 2024 | 12:22 AM
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పలువురు అన్నారు. మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ శనివారం పండుగలా సాగింది.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పలువురు అన్నారు. మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ శనివారం పండుగలా సాగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది. ముందుగా వీరికి ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. కార్యక్రమం అనంతరం సహపంక్తి భోజనం చేశారు.
ఆత్మకూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): అన్నింటిలో కన్నా విద్య ఎంతో గొప్పదని అలాంటి విద్యను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సూచించారు. ఆత్మకూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌ను అందించవచ్చునన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే తొలిసారిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులతో కలిసి ఇలాంటి సమావేశాలను నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రద్ద చదివించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రొగ్రెస్ కార్డు, హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే బుడ్డాకు విద్యార్థులు తయారు చేసిన పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకగా ఆయన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, అర్బన్ సీఐ రాము, డాక్టర్ సాజిదా ఫిర్దోస్, ఎంఈవో బాలాజీనాయక్, హెచ్‌ఎం షాహన ఉన్నిసా, నాయకులు వేణుగోపాల్, అబ్దుల్లాపురం బాషా, రాజారెడ్డి, వెన్నాశ్రీధర్‌రెడ్డి, మల్లె ఎలీషా, నాగూర్ ఖాన్ తదితరులు ఉన్నారు.
నందికొట్కూరు రూరల్: పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక్క అడుగు వేద్దాం అని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. అల్లూరు, కొణిదేలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయసూర్య హాజరయ్యారు. ఎమ్మెల్యే జయసూర్య ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ తల్లిదండ్రులు నెలకోసారైనా పాఠశాలకు వచ్చి విద్యార్థుల ప్రోగెస్ గురించి తెలసుకోవాలని సూచించారు.
కొణిదేల గ్రామంలోని జడ్పీ హైస్కూల్ అభివృద్ధి కోసం దాతలు మల్లెపోగు చిట్టెన్న రూ.లక్ష, పండగ విమలమ్మ రూ.లక్ష చెక్కులను ఎమ్మెల్యే జయసూర్యకు అందజేశారు. కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథరెడ్డి, ఎంఈవోలు సుభాన్, శ్రీనివాసులు, హెచ్‌ఎం శ్రీరామచంద్రమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్, సీఐలు సుబ్రమణ్యం, ప్రవీణ్‌కుమారెడ్డి, ఉప సర్పంచ్ భాస్కరెడ్డి, నాగటూరు ఉపసర్పంచ్ ఉశేనయ్య, మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల రూరల్: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి పాఠశాలలో జరిగిన కార్యక్ర మంలో ఎంఈవో బ్రహ్మంనాయక్ పాల్గొన్నారు.
నంద్యాల కల్చరల్: కూటమి హయాంలో రాష్ట్రం విద్యా హబ్‌గా అభివృద్ధి చెందుతుందని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ముల్లాన్‌పేటలోని మున్సిపల్ ఉర్దూ గర్ల్స్ హైస్కూల్‌లో పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు బాగా చదివి తమ తల్లితండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డీఎండబ్ల్యూవో డిస్ట్రిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆపీసర్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారి సబీహపర్వీన్, తదితరలు పాల్గొన్నారు.
పాములపాడు: మండలంలోని ప్రభుత్వ పాఠశా లల్లో పేరెంట్స్-టీచర్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వ హించారు. పాములపాడులోని ఏఎన్‌ఆర్ జడ్పీ మైస్కూల్‌లో విద్యార్థుల తల్లిదండ్రులకు హచ్‌ఎం గోపాల్, ఉపాధ్యాయులు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. అలాగే మోడల్ స్కూల్, కేజీబీవీలో నిర్వహించిన సమావేశాలలో సర్పంచ్ భాగ్యమ్మ, మండల ప్రత్యేకాధికారి రాజ్, తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్‌ఐ సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.
మిడుతూరు: మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలతో పాటు స్థానిక మాడల్ స్కూల్, జడ్పీ హైస్కూల్, కేజీబీవీలో శనివారం పేరెంట్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ సలీంబాషా, హెచ్‌ఎం సాయితిమ్మయ్య, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో దశరథరామయ్య, ఎస్‌ఐ ఓబులేసు, ఎంఈవో శ్రీనాథ్, వైద్యాధికారి తిరుపతి, టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి హాజరయ్యారు.
కొత్తపల్లి: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. గోకవరంలో జడ్పీ హైస్కూల్‌లో ఎంఈవో-2 ఇనయతుల్లా, హెచ్‌ఎం వెంకటరమణ ఆచారి, ఎస్‌ఐ కేశవ్, జోహా హాస్పిటల్ అధినేత డా.మన్సూర్ బాషా, మండల ఉపాధ్యక్షుడు సింగారపు వెంకటరమణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు దినేష్, గోకవరం పీహెచ్‌సీ వైద్యులు విజయేంద్ర, జి.పుల్లారెడ్డి గురుకుల ఉపాధ్యాయుడు రామకృష్ణ హాజరయ్యారు. మన్సూర్ బాషా మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలో పదవ తరగతిలో మొదటి స్థానంలో ఉత్తీర్ణుత సాధించిన ఈ పాఠశాల విద్యార్థికి రూ.25వేలు, మెడిసిన్ సీటు సాదించిన విద్యార్థికి రూ.50వేలు ప్రోత్సాహక బహుమతి ఇస్తానని ప్రకటించారు.
జూపాడుబంగ్లా: మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించారు. కార్యక్ర మంలో టీడీపీ మండల నాయకులు వెంకటేశ్వర్లు యాదవ్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
పాణ్యం: మండలంలో మెగా పేరంట్స్ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. పలు అంశాలపై చర్చించినట్లు ఎంఈవో కోటయ్య తెలిపారు.
గడివేముల: మండలంలో పేరెంట్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో వాసుదేవ గుప్తా, టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, ఎస్‌ఏ రఫీక్ పాల్గొన్నారు.
ఆత్మకూరురూరల్: కరివేనలోని జడ్పీ హైస్కూ ల్‌లో పేరెంట్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీశైలం నియోజక వర్గ ప్రత్యేకాధికారి సుధారాణి, ఆర్డీవో నాగజ్యోతి, ఎంపీపీ తిరుపాలమ్మ, కరివేన సర్పంచ్ మాణిక్యమ్మ,టీడీపీ నాయకులు శరత్, శివ శంకర శర్మ, కొండలరావు, దినకర్, శేషన్న యాదవ్, నాగేంద్రరావు, ఓబులేసు యాదవ్ పాల్గొన్నారు.,
బండిఆత్మకూరు: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల్లోనే పిల్లలు కూర్చునే టేబుల్లలోనే తల్లిదండ్రులను కూర్చోబెట్టి, రెండు మాటలు చెప్పి పంపారని పలుగ్రామాల్లో తల్లిదండ్రులు బాహాటంగానే చర్చించుకున్నారు. మండల కేద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎండలో కూర్చున ఓ విద్యార్థి స్ప్పహతప్పి పడిపోవటంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విద్యార్థి కిందపడిపోయిన విషయం వాస్తవమేనని, ఎలాంటి ఇబ్బంది లేదని ఎంఈవో మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, జడ్పీటీసీ రామతులశమ్మ, ఎస్‌ఐ జగన్మోహన్, ప్రిన్సిపాల్ రఫీ, ద్రాక్షాయణి, యాజమాన్య కమిటీ చైర్మన్ రమేష్, మండల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వెలుగోడు: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంఈవో బ్రహ్మం నాయక్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ పుల్లయ్య, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ సునీత, వైస్ చైర్మన్ మస్తాన్‌వలి పాల్గొన్నారు.
మహానంది: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఘనంగా తల్లితండ్రులతో ఉపాధ్యాయిల సమావేశం నిర్వహించారు. యు.బొల్లవరంలోని ప్రభుత్వ ప్రాఽథమికోన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన టీడీపీ నాయకుడు కిలారు వెంకటేశ్వర్లును ఉపాధ్యాయిలు అభినందించారు. ఉపాధ్యాయిని విమల పాఠశాల అభివృద్ధికి రూ.1.50 లక్షలు విరాళాలు సేకరించడంలో కృషి చేసినందుకు గాను గ్రామస్ధులు సన్మానించారు. మహానంది ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎం అంబమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బుక్కాపురంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్ధుల తల్లులు ముగ్గులు వేశారు. కార్యక్రమాల్లో ఎంఈవో రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 08 , 2024 | 12:22 AM