ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేత

ABN, Publish Date - Sep 04 , 2024 | 11:58 PM

ఎగువ పరివాహక ప్రాంతాల నుం చి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

శ్రీశైలం గేట్లన్నీ మూసేసిన దృశ్యం

శ్రీశైలం, సెప్టెంబరు 4: ఎగువ పరివాహక ప్రాంతాల నుం చి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో డ్యాం అధికారులు బుధవారం క్రస్ట్‌ గేట్లను మూసివేశారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 1,05,870 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 17,916 క్యూసెక్కులు, హంద్రీ ద్వారా 117 క్యూసెక్కులు మొత్తం 1,55,009 వరద నీరు వస్తోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయానికి 1,21096 క్యూసెక్కుల మేర వరద చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 209.1579 టీఎంసీలుగా నమోదైంది. ఏపీ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,298 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 37,116 క్యూసెక్కులు, మొత్తం 68,404 క్యూసెక్కుల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

విద్యుదుత్పత్తికి అంతరాయం : శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్‌ కేంద్రం స్విచ్‌ యాడ్‌ సమీపంలో విద్యుత్‌ లైన్‌ ట్రిప్పింగ్‌ కావడం వల్ల మంగళవారం అర్ధరాత్రి ఏడు గంటల సేపు అంతరాయం ఏర్పడింది. 7వ యూనిట్‌లో పొగమంచు, గాలి కారణంగా చెట్టుకొమ్మ వైఫై కండక్టర్‌ను తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీంతో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు అధికారులు మరమ్మతులు చేసి ఏడో యూనిట్‌లో విద్యుదుత్పత్తిని పునరుద్ధరించారు.

Updated Date - Sep 04 , 2024 | 11:58 PM

Advertising
Advertising