ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:41 AM

: సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.

మంచాలకట్టలో ట్రాక్టర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

గడివేముల, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. మండలంలోని మంచాలకట్ట గ్రామంలో సచివాలయం, రైతు సేవా కేంద్రం, హెల్త్‌ సెంటర్‌లను, బూజనూరు గ్రామంలో సచివాలయం, రైతు సేవా కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు పారిశ్రామికవాడగా తీర్చిదిద్ది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై గుంతలను పూడ్చేందుకు రూ.210 కోట్లు మంజూరు చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అన్నారు. అలగనూరు రిజర్వాయర్‌ మరమ్మతుల ఆవశ్యకతను సీఎం, ఇరిగేషన్‌ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రూ.43 కోట్లతో మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు జాతీయ ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరు చేశామని ఆమె పేర్కొన్నారు. గడివేముల, మంచాలకట్ట, గని గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి నుంచి బాధితులకు వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకులు పంట రామచంద్రారెడ్డి, కృష్ణాయాదవ్‌, మురళీమోహన్‌రెడ్డి, గని హర్షవర్ధన్‌, గిరిబాబు, ఈశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చిందుకూరు సర్పంచ్‌ అనసూయమ్మ, బూజనూరు సర్పంచ్‌ రాములమ్మ, ఎంపీడీవో వాసుదేవగుప్తా, తహసీల్దార్‌ వెంకటరమణ, మండల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:42 AM