ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నంద్యాల జిల్లాలో కార్డన్‌ సెర్చ్‌

ABN, Publish Date - Nov 25 , 2024 | 12:58 AM

జిల్లాలోని అన్ని సబ్‌ డివిజన్లలో ఏకకాలంలో కార్డెన్‌సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదివారం తెలిపారు.

సీతారామపురంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్న డీఎస్పీ

నంద్యాల క్రైం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని సబ్‌ డివిజన్లలో ఏకకాలంలో కార్డెన్‌సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదివారం తెలిపారు. అనుమానిత ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో పోలీస్‌ జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టామని చెప్పారు. అసాంఘిక, సంఘ విద్రోహశక్తుల ఆటకట్టించి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో సరైన ధృవపత్రాల్లేని 17 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. సంబంధిత గ్రామాల్లో గ్రామస్థులతో పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.

మహానంది: మహానంది మండలంలోని సీతారామపురం గ్రామంలో ఆదివారం నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. గ్రామంలో అనుమానస్పద ప్రదేశాలతో పాటు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. నంద్యాల రూరల్‌ సీఐ బి. శ్రీనివాసులరెడ్డి, మహానంది ఎస్‌ఐ రామ్మోహాన్‌రెడ్డి, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:58 AM