డిమాండ్లు నెరవేర్చి సోలార్ ఏర్పాటు చేసుకోవాలి
ABN, Publish Date - Nov 03 , 2024 | 12:32 AM
డిమాండ్లను నెరవేర్చిన తర్వాత సోలార్ ఏర్పాటు చేసుకోవాలని పైపాలెం గ్రామస్థులు అన్నారు.
మిడుతూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): డిమాండ్లను నెరవేర్చిన తర్వాత సోలార్ ఏర్పాటు చేసుకోవాలని పైపాలెం గ్రామస్థులు అన్నారు. నాగలూటి, పైపాలెం గ్రామాలను ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి శనివారం సందర్శించారు. మొదటగా సోలార్‌కు ఇచ్చిన ల్యాండ్ రికార్డులను ఆర్డీవో నాగలూటి గ్రామ సచివాలయంలో పరిశీలించారు. సోలార్‌కు అప్పగించిన నాగలూటి, పైపాలెం, మాసపేట గ్రామాలకు చెందిన ల్యాండ్ వివరాలను తహసీల్దార్ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. పైపాలెం గ్రామస్థులు నాగలూటి సచివాలయం వద్ద చేరుకొని తమ గ్రామానికి న్యాయం చేయాలని ఆర్డీవోను వేడుకున్నారు. ఆర్డీవో స్పందిస్తూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం పైపాలెం గ్రామంలోని సోలార్‌కు ఇచ్చిన ల్యాండును ఆర్డీవో పరిశీలించారు. డిప్యూటీ ఇన్పెక్టర్ ఆఫ్ సర్వే ఉమాపతి, డిప్యూటీ తహసీల్దార్ షానవాజ్, సర్వేయర్ కృష్ణుడు, వీఆర్వో సుందర్ రాజ్, సచివాలయ సిబ్బంది, పైపాలెం సర్పంచ్ రామచంద్రుడు, జగన్‌మోహన్ రెడ్డి, ఇనాయతుల్ల, వెంకటేశ్వర్లు, రామేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే భూములు కేటాయించాలి’
పైపాలెం గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తరువాతనే సోలార్‌కు భూములు కేటాయించాలని సీపీఐ జిల్లా నాయకులు రఘరాం, రమేష్‌బాబు డిమాండ్ చేశారు. ఆర్డీవో నాగజ్యోతికి వినతి పత్రం అందించారు. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండు చేశారు. పైపాలెం గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 12:32 AM