మహానందిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ డైరెక్టర్
ABN, Publish Date - Nov 15 , 2024 | 01:30 AM
మహానంది ఆలయంలో మహానందిలో గురువారం ఎన్‌ఆర్‌ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ కుమార్‌ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహానంది, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): మహానంది ఆలయంలో మహానందిలో గురువారం ఎన్‌ఆర్‌ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ కుమార్‌ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏఈవో మధు ఆధ్వర్యంలో వేదపండితులు ఆశీర్వదించారు. స్వామి వారి మెమెంటో అందజేశారు. అనంతరం మహానంది మండలంలోని అల్లీనగరం, యి. బొల్లవరం, ఎంసీ ఫారం, గాజులపల్లి ఆర్‌ఎస్‌లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మాణంలో ఉన్న సీసీ రహదార్లతో పాటు ఉపాధిహామీ పఽథకం ద్వారా చేసిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పాడి రైతులకు పశువులు ఉన్న వాటిని బట్టి షెడ్ల నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 22,500 గోకులం షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన కుమార్ తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జనార్దన్‌రావు, పీఆర్ ఈఈ శ్రీనివాసులు,, ఏపీడీ బాలాజీ నాయక్, డీఎల్‌పీవో రాంబాబు, ఎంపీడీవో మహమ్మద్ దౌలా, ఈవోఆర్డీ నాగేంద్రుడు, ఏపీవో మనోహర్, పంచాయతీ కార్యదర్శులు నాగ సంజీవరావు, కలువ భాస్కర్ పాల్గొన్నారు.
నంద్యాల రూరల్: స్వర్ణ పంచాయతీలుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఉపాధిహమీ పథకం సంచాలకుడు షణ్ముకకుమార్ అన్నారు. గురువారం జిల్లాలో పల్లె పండుగలో కార్యక్రమంలో గుర్తించి చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. నంద్యాల డ్వామా కార్యాలయంలో ఉపాధి హమీ, పంచాయతీ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
Updated Date - Nov 15 , 2024 | 01:30 AM