ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:00 AM

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు.

నెహ్రూనగర్‌లో చిన్నారులకు మాత్రలు వేస్తున్న సిబ్బంది

ఆత్మకూరు, సెప్టెంబరు 17: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. నులిపురుగుల నివారణ కోసం విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యురాలు డాక్టర్‌ సాజిదా ఫిర్దోస్‌ అన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నాగరాజు, మెప్మా ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు ఉన్నారు.

ఆత్మకూరు రూరల్‌: నులి పురుగులను పూర్తిగా నిర్మూలించి, రక్త హీనతను తగ్గించేందుకే ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు వైధ్యాధికారులు గోపాల్‌, పవన్‌కుమార్‌అన్నారు. మంగళవారం బైర్లూటి, కొట్టాల చెరువు పీహెచ్‌సీల పరిధిలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. అమలాపురంలోని ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీహెచ్‌వో రజిత, హెల్త్‌ అసిస్టెంట్‌లు విశ్వనాథ్‌, భాస్కర్‌, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

నందికొట్కూరు: పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో హెడ్‌ మాస్టర్‌, రాజేశ్వరి, నారాయణ, సమీనా, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు మీనాక్షి, హెల్త్‌ సెక్రటరీ జయలక్ష్మి, వైద్యులు పాల్గొన్నారు.

పగిడ్యాల: నులిపురుగుల నివారించి రక్తహీనత నుంచి విద్యార్థులను కాపాడడానికి ఆల్బెండజోల్‌ మాత్రలను ప్రభుత్వం అందజేస్తు న్నట్లు పగిడ్యాల పీహెచ్‌సీ వైద్యాధికారి మోహన్‌ తెలిపారు. వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలలోని విద్యార్థులకు మంగళవారం మాత్రలను అందజేసినట్లు తెలిపారు. నెహ్రూనగర్‌ గ్రామంలోని 2వ అంగన్‌వాడీ కేంద్రంలో సర్పచ్‌ రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి వీరన్న చిన్నారులకు మాత్రలు అందజేశారు.

Updated Date - Sep 18 , 2024 | 12:00 AM

Advertising
Advertising