సాగునీటి సంఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: ఎమ్మెల్యే
ABN, Publish Date - Dec 02 , 2024 | 12:45 AM
సాగునీటి సంఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు.
పాణ్యం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు. ఆదివారం పాణ్యం టీడీపీ కార్యాలయంలో ఆమెతో పాటు టీడీపీ నాయకులు గౌరు వెంకటరెడ్డి కార్యకర్తలతో సహావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పాణ్యం మండలంలో 17 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఎస్సార్బీసీ కాలువ ఆధ్వర్యంలో ఉండగా చిన్ననీటిపారుదల కింద ఆరు చెరువులకు సంఘాలు ఉన్నాయన్నారు. ఈనెల 8వతేదీన జరిగే ఎన్నికల్లో సభ్యులు సంఘ సభ్యులను ఎన్నుకొని రైతుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. టీడీపి సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని నాయకులను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ డీఈ నాగన్న, కాడా డివిజన్ జేఈ చంద్రుడు, సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రనాథెడ్డి, ఎంపీటీసీ భాస్కరరెడ్డి, మండల టీడీపీ కన్వీనర్ జయరామిరెడ్డి, నియోజకవర్గ యువజన నాయకులు గౌరు జనార్దనరెడ్డి, మాజీ ఎంపీటీసీ తిరిపాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తూరు దేవస్థానంలో ఆదివారం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె తనయుడు గౌరు జనార్దనరెడ్డి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రామకృష్ణ ఎమ్మెల్యేకు స్వాగతం పలికి పంచామృతాభిషేకం, కుంకుమార్చనలు తదితర పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు నారాయణ స్వామి, సురే ష్ శర్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 12:45 AM