ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి ప్రభుత్వంలో కరెంటు చార్జీల బాదుడు

ABN, Publish Date - Dec 28 , 2024 | 01:08 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలను భారీగా పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపుతోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి ధ్వజమెత్తారు.

ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నాయకులు

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి

కర్నూలులో భారీ ర్యాలీ

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలను భారీగా పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపుతోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి ధ్వజమెత్తారు. పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం వైసీపీ శ్రేణులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ముందుగా ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్టీబీసీ కళాశాల నుంచి కేవీఆర్‌ కళాశాల ఎదురుగా ఉన్న విద్యుత శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి కార్యక్రమంలో కరెంటు చార్జీలు పెంచబోమని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ మరచిపోయి కరెంటు చార్జీలు పెంచడం దారుణమన్నారు. ప్రజలపై సుమారు రూ.15 వేల కోట్ల భారం వేయడం సరికాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రూ.75 వేల కోట్లు అప్పుచేశారని అన్నారు. దాదాపు అన్ని సంక్షేమ పథకాలకు మంగళం పాడారని విమర్శించారు. త్వరలోనే ప్రజా వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం రుచిచూస్తుందని హెచ్చరించారు. అనంతరం విద్యుత శాఖ డీఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ బీవై.రామయ్య, నాయకులు అహ్మద్‌ అలీఖాన, తెర్నేకల్‌ సురేందర్‌ రెడ్డి, సుభాస్‌ చంద్రబోస్‌, కార్పొరేటరు సత్యనారాయణమ్మ, మునెమ్మ తదితరులు పాల్గొన్నారు.

12 మంది కార్పొరేటర్లు డుమ్మా..!

పెంచిన విద్యుత చార్జీలను తగ్గించాలని కోరుతూ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అయితే కర్నూలు అసెంబ్లీకి సంబంధించిన 12 మంది వైసీపీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. గతం నుంచే ఎస్వీ మోహనరెడ్డి వర్గానికి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన వర్గానికి ఆధిపత్యపోరు సాగుతోంది. ఇటీవలి కాలంలో కూడా చాలా సందర్బాల్లో బయటపడ్డాయి. అయితే ప్రత్యేకంగా నిర్వహించిన ర్యాలీకి కార్పొరేటర్లు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Dec 28 , 2024 | 01:08 AM