మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:11 AM
మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మైనారిటీ శాఖ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
ఆత్మకూరు రూరల్, నవంబరు 29: మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మైనారిటీ శాఖ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ శివార్లలోని పెద్ద మదరసా ప్రాంతంలో జనవరి 7,8 న నిర్వహించనున్న తబ్లిగీ ఇజితేమాలో మౌళిక సదుపాయాల కల్పన కోసం కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మైనారిటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. ప్రధానంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు మైనారిటీ కార్పొరేషన్, హజ్ హౌస్, దుకాన్, మకాన్, దుల్హన్ పథకం, షాదీఖానాల ఏర్పాటు, రంజాన్ తోఫా, మసీదులకు మరమ్మతులకు నిధులు తదితర సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి మైనారిటీల సంక్షేమానికి పాటు పడ్డారన్నారు. ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మంది మైనారిటీలు రానున్నారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించి ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. తాను మంత్రి ఫరూక్‌తో కలిసి సీఎం చంద్రబాబును కలిశామని, ఈ మేరకు రూ. 1.50 కోట్ల నిధులను కోరామని ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం ఆ నిధులను మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రత్నరాధిక, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ రామాంజినాయక్, సీఐ సురేష్ కుమార్‌రెడ్డి,మండల స్థాయి అదికారులు, ఇజితెమా కమిటి సభ్యులు హబీబుల్లా, అమీర్ సాహెబ్, నూర్ బేగ్,గౌస్‌లాజం,మౌళానా రహంతుల్లా,షాలిపైల్మాన్, ఇషాక్, ఇజితెమా కమిటి వలంటీర్లు, ముస్లిం మైనారిటీలు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 12:11 AM