‘పేదలకు అండగా ప్రభుత్వం’
ABN, Publish Date - Dec 05 , 2024 | 12:42 AM
కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.
నందికొట్కూరు రూరల్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. మండలంలోని అల్లూరు గ్రామంలో మాండ్ర నివాసంలో మిడుతూరు మండలానికి చెందిన కడుమూరు గ్రామం జనానర్దనరెడ్డి కుమార్తెకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన రూ. 1,58,783 చెక్కును బుధవారం మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య అందజేశారు. వారు మాట్లాడుతూ రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గ అబివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథరెడ్డి, కాతా రమేష్‌రెడ్డి నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.
టీడీపీలో చేరిక: నాగంపల్లి గ్రామ వైసీపీ నాయకులు టీడీపీ కొత్తపల్లె మండల కన్వీనర్ నారపురెడ్డి, నాగేశ్వరారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరారు. అల్లూరులో మాండ్ర నివాసంలో వైసీపీ నాయకులు మద్దిలేటి, వెంకటేశ్వర్లు, చిన్న మస్తాన్, మోక్షేశ్వరుడు, సాంబశివుడు, కిష్టన్న, వెంకటనారాయణ, తదితరులతో పాటుగా మరికొంతమందికి ఎమ్మెల్యే జయసూర్య తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు వెంకటేశ్వర్లు, జంబులయ్య, లింగస్వామి పాల్గొన్నారు.
Updated Date - Dec 05 , 2024 | 12:42 AM