ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:53 AM

ఆంధ్రప్రదేశ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి.

చెన్నమ్మసర్కిలో కేక్‌ కట్‌ చేస్తున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, సెప్టెంబరు 2: ఆంధ్రప్రదేశ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. సోమవారం ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన అధ్యక్షుడు చింతా సురేష్‌బాబు ఆధ్వర్యంలో కల్లూరు చెన్నమ్మసర్కిల్లో నిర్వహించిన డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ముఖ్య అతిఽథిగా హజరై కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై సంబరాలు జరుపుకున్నారు.

కర్నూలు(రూరల్‌): గొప్ప మానవతావాది పవన కళ్యాణ్‌ అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు రూరల్‌ మండ లం పి.రుద్రవరం గ్రామంలో జనసేనా ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోమవారం పవనకళ్యాణ్‌ జన్మదిన పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరానికి ముఖ్యఅతిథిగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై మాట్లాడారు. అనంతరం రక్తదానం చేసిన వారికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన కోడుమూరు, కర్నూలు ఇనచార్జి ఆకెపోగు రాంబాబు, షేక్‌ అర్షద్‌ పాల్గొన్నారు.

విద్యార్థికి ట్యాబ్‌ అందజేత

కర్నూలు(రాజ్‌విహార్‌ సర్కిల్‌): ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమవారం పేద విద్యార్థికి రాయల్‌ ఆఫిషియల్స్‌ ఆండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన జిల్లా ప్రధాన క్యారదర్శి కోనేటి వెంకటేశ్వర్లు సొంత ఖర్చులతో ట్యాబ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవనకల్యాణ్‌ ద్వారానే తమలో సామా జిక సేవా ధృక్పదం ఏర్పడిందని, దీనిని భవిష్యత్తులో కొనసాగిస్తామన్నారు. కార్యక్ర మంలో రోపా ప్రతినిధులు చింతలపల్లి రామకృష్ణ, చంద్రమోహన, ఆర్జా రామకృష్ణ, ఈశ్వర్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

సి.బెళగల్‌: మండల కేంద్రంలో పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల అవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పరిశీలించారు. కార్యక్రమంలో జన సేన మండల నాయకులు ఫరుక్‌బాషా, ఎంపీటీసీ ఈరన్నగౌడు, టీడీపీ మాజీ మండల కన్వీనర్‌ తిమ్మప్ప, మాజీ ఎంపీటీసీ దనుంజయుడు, గౌస్‌, బాలజీ వెంక టేశ, భీమన్న, రామకృష్ణ పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండలంలోని వివిధ గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు అభిమానులు సోమవారం ఘనంగా జరుపుకు న్నారు. నన్నూరులో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. హుశేనాపురంలో అభిమా నులు మొక్కలు నాటి, 20 కేజీల కేక్‌ను కట్‌ చేశారు. కార్యక్రమంలో శ్రీరామ పుల్లారెడ్డి, వసంతాల శివారెడ్డి, పాణ్యం శ్రీనివా సులు, గడేకల్‌ చిన్న నారాయణ, కర్నూలు బీఎస్‌ఏ చైర్మన భూపతి, రమేష్‌, సత్యనా రాయణ, చందు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 12:53 AM

Advertising
Advertising