ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: నంద్యాల జిల్లాలో ముదురుతున్న గ్రూప్ వార్.. బైరెడ్డిని కాదని.. జయసూర్య గూటికి..

ABN, Publish Date - Aug 07 , 2024 | 05:50 PM

నంద్యాల జిల్లా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓవైపు జిల్లాలో వైసీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతల చేరికలతో టీడీపీ బలపడుతున్నా.. గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి.

Rajasekhar Reddy vs Jayasurya

నంద్యాల జిల్లా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓవైపు జిల్లాలో వైసీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతల చేరికలతో టీడీపీ మరింత బలపడుతున్నా.. గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయంతో అక్కడి పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. నంద్యాల ఎంపీగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు. అయితే ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడంతో.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి నంద్యాల టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ముఖ్య అనుచురుడు గిత్త జయసూర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి.. గెలిచారు. అప్పటినుంచి ఇక్కడ గ్రూప్ వార్ మొదలైంది. ఎంపీ శబరి తండ్రి రాజశేఖర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే గిత్త జయసూర్యగా ఇక్కడి రాజకీయం మారింది. నియోజకవర్గంలో తన మాట గెలవాలని శివానందరెడ్డి, జయసూర్య పట్టుబడుతుంటే.. తమ మాట గెలవాలని రాజశేఖర్ రెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో నందికొట్కూరు రాజకీయం రసవత్తరంగా మారింది. చేరికల విషయంలోనూ ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. తాజాగా నందికొట్కూరుకు చెందిన వైసీపీ కౌన్సిలర్లు ఇటీవల బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే తాజాగా వీరిలో నలుగురు కౌన్సిలర్లు జయసూర్య గూటికి చేరడంతో ఇక్కడ గ్రూప్ వార్ తారాస్థాయికి చేరుకుందన్న చర్చ జరుగుతోంది.

AP News: మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు


గ్రూప్ వార్..

నందికొట్కూరు నియోజకవర్గంలో గ్రూప్ వార్‌తో ఇక్కడి శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ క్యాడర్ సైతం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా విడిపోయారు. దీంతో రాజశేఖర్ రెడ్డి చేస్తున్న పనులను జయసూర్య వర్గం అడ్డుకోవడం, ఎమ్మెల్యే వర్గం చేస్తున్న పనులను మాజీ ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంటూ వస్తున్నారు. ఇటీవల వైసీపీకి చెందిన నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. నెల తిరగకముందే వీరిలో నలుగురు జయసూర్య గూటికి చేరుకోవడం ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి మున్సినల్ ఛైర్మన్ సైతం టీడీపీలో చేరడంతో ఆయనను ఛైర్మన్‌గా కొనసాగించాలని రాజశేఖర్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తమ వర్గానికి చెందిన వ్యక్తిని ఛైర్మన్ చేసేందుకు శివానందరెడ్డి, జయసూర్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

CM Chandrababu: సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్న సీఎం చంద్రబాబు


ప్రతి విషయంలో..

నందికొట్కూరులో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం మారడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన పార్టీ క్యాడర్‌లో నెలకొంది. నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే జయసూర్యకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. మరోవైపు గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు.. తన కుమార్తె ఎంపీగా ఉండటంతో నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్య గ్రూపు రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.


CM Chandrababu: వైసీపీ నేతలు చేసినట్లు చేయవద్దని పదే పదే చెప్తున్నా...

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 05:50 PM

Advertising
Advertising
<