ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ABN, Publish Date - Nov 27 , 2024 | 12:18 AM

నంద్యాల ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాల యంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఎస్పీ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఏఆర్‌ డీఎస్పీ

నంద్యాల కల్చరల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పోలీస్‌ కార్యాల యంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా సాయిధ బలగాల డీఎస్పీ శ్రీనివాసులు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు మంజునాఽథ్‌, నాగభూషణం, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీస్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల క్రైం: నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. డీఎస్పీ పి.శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

నంద్యాలలోని న్యాయవాది ఎం.వెంకటేశ్వరుడు కార్యాలయంలో మాదిగ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. మాదిగ అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరుడు, జాయింట్‌ సెక్రటరీ వనం శ్రీనివాసులు, అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు బి.శ్రీనివాసులు, జగదీష్‌, శంకర్‌ పాల్గొన్నారు.

నంద్యాల రూరల్‌: పట్టణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యాలయం, విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, విద్యుత్‌శాఖ ఈఈ(టెక్నికల్‌) పెద్దయ్య, ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమళ్ల రహీం, మునిశేఖర్‌, విద్యుత్‌శాఖ డీఈఈ రమేష్‌కుమార్‌, డీ2, డీ3 ఏఈలు రామయ్య, రవికుమార్‌ పాల్గొన్నారు.

నందికొట్కూరు రూరల్‌: కొణిదేలలో జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహానికి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. నాగటూరులో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో పట్టణ సీఐ ప్రవీణ్‌కుమారెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సి పాల్‌ రవి, మిడుతూరు రోడ్డు కూడలిలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రాహానికి వైసీపీ నందికొట్కూరు ఇన్‌చార్జి ధారాసుధీర్‌ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమాల్లో హెచ్‌ఎం శ్రీరామచంద్ర మూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మహానంది: మహానంది ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ వి. జయలక్ష్మి, శాస్త్రవేత్తలు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

మిడుతూరు: మిడుతూరులోని ఎంపీడీవో కార్యాలయం, కేజీబీవీలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కేజీబీవీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి బహుమతులు అందజేశారు. ఎంపీడీవో దశరథరామయ్య, ఏవో సురేష్‌, పీఎస్‌లు గోవిందు, అనూరాధ పాల్గొన్నారు.

పాములపాడు: పాములపాడులోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహం పాల్గొన్నారు.

ఆత్మకూరు: ఆత్మకూరు పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రజా సంఘాల నాయకులు రాబిన్‌సన్‌రాజు, దరగయ్య, మల్లయ్య, శీలం శేషు, టపాల్‌ అష్రఫ్‌అలీ పాల్గొన్నారు.

బండిఆత్మకూరు: శింగవరంలోని అమృత్‌ సరోవర్‌ పథకం వద్ద ఎంపీడీవో దస్తగిరి, ఏపీవో వసుధ ఉపాధి కూలీలతో కలిసి రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కోర్స్‌ డైరెక్టర్‌ ఇస్మాయిల్‌, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.

పాణ్యం: పాణ్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలుల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌, ఈవోఆర్డీ చందమౌళీశ్వరగౌడ్‌, టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దానం, టీడీపీ నాయకులు రామ్మోహన్‌నాయుడు, ఏఐఎఫ్‌బీ నాయకులు వెంకటాద్రి, మాలమహానాడు నాయకులు దత్తు, శివకృష్ణ యాదవ్‌, ప్రతాప్‌, రాజేష్‌, రాజేంద్ర, బాలసుబ్బయ్య, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామన్‌, అధ్యాపకులు జాషువా, శ్రీనివాసులు, ఖాద్రి, రమేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

గడివేముల: గడివేములలోని కేజీబీవీలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఈవో విమలావసుంధరాదేవి, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి రుబిన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 12:18 AM