‘యోగా సాధనతో ఆరోగ్యకరమైన జీవితం’
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:09 AM
యోగా సాధనతో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని సాయుధ బలగాల (ఏఆర్) అడిషనల్ ఎస్పీ చంద్రబాబు అన్నారు.
నంద్యాల క్రైం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): యోగా సాధనతో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని సాయుధ బలగాల (ఏఆర్) అడిషనల్ ఎస్పీ చంద్రబాబు అన్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు శుక్రవారం పోలీస్ పరేడ్ డ్రిల్ కార్యక్రమంలో భాగంగా యోగా ట్రైనర్ ఆశ సహకారంతో పోలీస్ సిబ్బందికి యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ కొన్నివేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి ఎంతో ముందుచూపుతో మన సమాజ ం ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో యోగా ప్రక్రియను ఏర్పాటు చేశామన్నారు. నిత్యం పనిఒత్తిడితో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోలీసులు విధినిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, మానసిక ఒత్తిడిని యోగా సాధనవల్ల అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు ఇస్మాయిల్, అన్సర్‌బాషా, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్, శ్రీనివాసులు, పట్టణంలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 12:09 AM