ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి ప్రభుత్వంలో బాదుడే.. బాదుడు

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:38 AM

ఎన్నికల ముందు విద్యుత్‌ చార్జీలు పెంచమని వాగ్దానం చేసిన కూటమి అధికారం లోకి రాగానే ప్రజలపై బాదుడే..బాదుడు మొదలు పెట్టారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాట సాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు

మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

27న విద్యుత్‌ అధికారులకు వినతి

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కల్లూరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు విద్యుత్‌ చార్జీలు పెంచమని వాగ్దానం చేసిన కూటమి అధికారం లోకి రాగానే ప్రజలపై బాదుడే..బాదుడు మొదలు పెట్టారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాట సాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన స్వగృహంలో అధిష్టానం ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించి ఈనెల 27న జిల్లా, నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌లు విద్యుత్‌ చార్జీలు పెంపును నిరసిస్తూ కరెంట్‌ ఆపీసుకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో రెండు సార్లు ట్రూఅప్‌, విద్యుత్‌ చార్జీల పేరిట వేల కోట్ల భారాన్ని వేశారని ఆరోపించారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలో ఈనెల 27న కర్నూలు విద్యుత్‌ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని ఎస్‌ఈకి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్దఎత్తున హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - Dec 25 , 2024 | 12:38 AM