హాస్టల్‌ తనిఖీ

ABN, Publish Date - Oct 25 , 2024 | 01:11 AM

పట్టణంలోని బాలుర బీసీ హాస్టల్‌ను సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు.

 హాస్టల్‌ తనిఖీ
బీసీ హాస్టల్‌ను పరిశీలిస్తున్న న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని

నందికొట్కూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బాలుర బీసీ హాస్టల్‌ను సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని కనీస మౌలిక వసతులు, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? లేదా? అన్న తదితర అంశాలపై హాస్టల్‌ వార్డెన్‌ మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌ రూంలో ఉన్న నిత్యావసర వస్తువులను ఆమె పరిశీలించారు. హాస్టల్‌లో ఉన్న సమస్యలను అడిగి ఆమె తెలుకున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 01:11 AM