దెబ్బతిన్న పంటల పరిశీలన
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:25 AM
ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న మినుము పంటను బుధవారం నంద్యాల వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజశేఖర్, మండల వ్యవసాయాధికారి హేమసుందర్‌రెడ్డి పరిశీలించారు.
గడివేముల, సెప్టెంబరు 4: ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న మినుము పంటను బుధవారం నంద్యాల వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజశేఖర్, మండల వ్యవసాయాధికారి హేమసుందర్‌రెడ్డి పరిశీలించారు. రైతులను అడిగి వివరాలను సేకరించారు. పూత దశలో ఉన్న మినుము పంట వర్షాలకు దెబ్బతిని మొలకలు వచ్చాయని రైతులు అధికారులకు వివరించారు. వేలాది రూపాయలు పెట్టుబడి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 300 ఎకరాల మినుము పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయాధి కారులు ప్రాథమిక అంచనా వేశారు. మరో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పైర్లను పరిశీలించి పూర్తి నివేదికను అందిస్తామని వ్యవ్యసాయాధికారులు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:25 AM