సబ్ జైలు తనిఖీ
ABN, Publish Date - Oct 17 , 2024 | 12:22 AM
జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ బి.లీలావెంకటశేషాద్రి బుధవారం నందికొట్కూరు సబ్ జైలును తనిఖీ చేశారు.
నందికొట్కూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ బి.లీలావెంకటశేషాద్రి బుధవారం నందికొట్కూరు సబ్ జైలును తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ జైలులో ఉన్నటువంటి ఖైదీలను విచారించి వారికి న్యాయ సలహాలు ఇచ్చారు. న్యాయవాదిని నియమించుకునే స్తోమతలేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని నియమించనున్నట్లు తెలిపారు. అనంతరం జైలు పరిసరాలు, ఖైదీలకు వడ్డించే ఆహారం, సదుపాయాలు, ఆరోగ్య పరిస్థి తుల గురించి విచారించారు. కార్యక్రమంలో జైలు విజిటింగ్ లాయర్ అరుణ్‌కుమార్, జైలు సూపరింటెండెంట్ జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Oct 17 , 2024 | 12:22 AM