ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన గురుకుల పాఠశాల తనిఖీ

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:40 AM

మండలంలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలను డీఈవో జనార్దనరెడ్డి గురువారం తనిఖీ చేశారు.

విద్యార్థినులతో మాట్లాడుతున్న డీఈవో

పాణ్యం, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలను డీఈవో జనార్దనరెడ్డి గురువారం తనిఖీ చేశారు. నెరవాడ మెట్ట వద్ద బాలికల పాఠశాలలోని డైనింగ్‌హాల్‌, ఆర్వో ప్లాంటు, డార్మెట్రీ, క్లాస్‌ రూములు, బాత్‌రూమ్‌లు, స్టోర్‌ రూం, వంటగది పరిశీలించారు. అనంతరం బాలికల సమస్యలు తెలుసుకున్నారు. బాలికల శాతాన్ని పెంచాలని ప్రిన్సిపాల్‌ మేరీ సలోమిని ఆదేశించారు. డార్మెట్రీల్లో సరైన వెంటిలేషన్‌ లేక బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాలికలు తెలిపారు. ఫ్యాన్‌లు లేని చోట్ల వెంటనే ఫ్యాన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఫిజిక్స్‌ ఉపాధ్యాయుని కొరత ఉండడంతో విశ్రాంత ఉపాధ్యాయున్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. మెనూ సక్రమంగా పాటించాలన్నారు. బాత్‌రూంలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురుగు కాల్వ నిర్మాణం లేక నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోందని విద్యార్థులు చెప్పారు. ఎంఈవో కోటయ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:40 AM