మహానందిలో ముగిసిన కార్తీక మాసోత్సవాలు
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:12 AM
మహానంది క్షేత్రంలో కామేశ్వరీదేవి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శనివారం అలయ వేదపండితులు నిర్వహించారు.
మహానంది, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో కామేశ్వరీదేవి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శనివారం అలయ వేదపండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి ఆలయ అర్చకులు వనిపెంట ప్రకాశం శర్మతో పాటు అర్చకులు, బుత్వికులు ప్రత్యేక పూజలను జరిపారు. అనంతరం వేదపండితుడు రవిశంకర్ అవధానితో పాటు ప్రత్యేక బుత్వికులు లక్షబిల్వార్చన, కుంకుమార్చన దాతలు గడ్డం రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతుల చేత భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. కలశాలతో రుద్రగుండం జలాలను తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణను చేసిన తర్వాత స్యయంభువు శివలింగాన్ని అభిషేకించారు. యాగశాల మంటపంలో వివిధ ద్రవ్యాలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఈవో, దాతల చేత నిర్వహింప చేసారు. దీంతో మహానందిలో కార్తీక మాసోత్సవాలు ముగిసాయి. ఏఈవో ఎర్రమల్ల మధు, పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఎస్ శ్రీనివాసులుతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 12:12 AM