జలహారతిని విజయవంతం చేద్దాం
ABN, Publish Date - Dec 31 , 2024 | 11:46 PM
తెలుగు తల్లికి జలహారతి పేరుతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేదా ్దమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): తెలుగు తల్లికి జలహారతి పేరుతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేదా ్దమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ ప్రజలంతా వలసలకు వెళ్లకుండా నివా రించేందుకు సాగు చేసిన రైతుకు నీరందక, పంటలు చేతికందక, వర్షాలు రాక ఆత్మహత్యలకు పాల్పడే వారని, ఇక ఈ స్థితి నుండి విముక్తి కలగనుందని తెలిపారు. గోదావరి నుండి బనకచర్లకు నీటిని తెచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు సీఎం, చంద్రబాబు కంకణం కట్టుకున్నారని తెలిపారు. దాదాపు రూ. 80 నుంచి రూ. 90 కోట్ల మేరకు నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వ, ప్రపంచ బ్యాంక్ సహకారంతో నిర్మాణాలకు రూపకల్పన చేశారన్నారు. నాయకులు ఆకెపోగు ప్రభాకర్, నంద్యాల నాగేంద్ర, కే. మహేష్ గౌడ్, నగరాజు యాదవ్, ఎల్‌వీ ప్రసాద్, షేక్షావలి పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2024 | 11:46 PM