కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే
ABN, Publish Date - Oct 17 , 2024 | 12:27 AM
గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
నందికొట్కూరు రూరల్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మండలం లోని బిజినవేముల గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించి పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, సర్పంచ్ రవియాదవ్, ఎంపీడీవో సుబ్రమణ్యశర్మ, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పగిడ్యాల: పగిడ్యాల, ప్రాతకోట, రైతుపల్లె గ్రామాల్లో బుధవారం పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణా నికి ఎమ్మెల్యే జయసూర్య భూమిపూజ చేశారు. పీఆర్ ఈఈ రఘరాంరెడ్డి, ఎంపీడీవో సుమిత్రమ్మ, బీజేపీ నియోజకవర్గ నాయకుడు దామోదర్‌రెడ్డి, మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, టీడీపీ నాయకులు పలుచాని మహేశ్వరరెడ్డి, ప్రాతకోట సర్పంచ్ శేషమ్మ, వాసురెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నాగశేషులు, వెంకట్‌రెడ్డి, శేషు, కర్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పాములపాడు: పాములపాడులోని బీసీ కాలనీతో పాటు మరో రెండు చోట్ల పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ల నిరకు భూమిపూజ నిర్వహించారు. టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి, గోవిందు, చంద్రశేఖర్, పూసల కృష్ణ, హఫీజ్, మల్లీశ్వరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లాలో సీసీ రోడ్డు పనులను బుధవారం ప్రారంభించారు. ఎంపీపీ సువర్ణమ్మ, సర్పంచు బాలయ్య, ఎంపీటీసీలు వెంకటమ్మ, కృపాకర్, టీడీపీ నాయకులు జంగాల పెద్దన్న, టీడీపీ నాయకులు బాబు, మోహన్‌రావు, గోపి, అధికారులు పాల్గొన్నారు.
కొత్తపల్లి: వీరాపురంలో సర్పంచ్ సరస్వతమ్మ అధ్యక్షతన పల్లె పండుగ కార్యక్రమం జరిగింది. బీసీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. టీడీపీ నాయకులు కర్నాటి శివారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
మహానంది: తమ్మడపల్లి, అల్లీనగరం, శ్రీనగరం, మహానంది గ్రామాల్లో పల్లె పండుగలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎంపీపీ యశస్వీని, టీడీపీ నాయకులు శ్యామల జనార్దన్‌రెడ్డి, సుంకులయ్య, హరిశ్చంద్రప్రసాద్, గంగిశెట్టి మల్లికార్జునరావు అధికారులు పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: బండిఆత్మకూరు, శింగవరం, రామాపురం, సోమయాజులపల్లె గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమం నిర్వహిం చారు. అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. టీడీపీ నాయకులు నరసింహారెడి,్డ సుబ్బారెడ్డి, జాకీర్, చెన్నారెడ్డి, ఈశ్వరరెడ్డి, రామసుబ్బయ్య, ధనుంజయగౌడ్, నబీరసూల్, సుబ్బలక్ష్మయ్య, అధికారులు పాల్గొన్నారు.
గోస్పాడు: గోస్పాడు, ఒంటివెలగల తదితర గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమాలను నిర్వహించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణా నికి భూమిపూజ చేశారు. టీడీపీ మండల కన్వీనర్ తులసీశ్వరరెడ్డి, సహకార సొసైటీ మాజీ చెర్మన్ భాస్కరరెడ్డి, నాయకులు వీరా రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ ప్రమీల, భూమా వుశేని, బాలన్న, అధికారులు పాల్గొన్నారు.
గడివేముల: కరిమద్దెల, పెసరవాయి గ్రామాల్లో పల్లె పండుగలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పెసరవాయి గ్రామంలో రైతులకు గోనే సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, వడ్లు లక్ష్మీదేవి, శివారెడ్డి, వడ్డు ప్రశాంతి, రమణయ్య, మండల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 17 , 2024 | 12:27 AM