ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీసీ పీఠం ఎవరికో?

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:20 PM

సాగునీటి సంఘాల ఎన్నికల్లో చివరి ఘట్టానికి సమయం ఆసన్నమైంది.

టీబీపీ ఎల్లెల్సీ పీసీ చైర్మన్‌ స్థానానికి పోటీ

గాజులదిన్నె ప్రాజెక్టు కమిటీపై సర్వత్రా ఆసక్తి

టీడీపీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌

సాగునీటి సంఘాల ఎన్నికల్లో చివరి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మూడు దశల్లో జరిగే ఎన్నికల్లో సాగునీటి వినియోగదారుల సంఘం (డబ్ల్యూయూఏ), డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ) ఎన్నికలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇక కీలకమైన ఎల్లెల్సీ జీడీపీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండు ఎన్నికలు జలమండలి కార్యాలయంలో జరగనున్నాయి. ఎన్నికల నోడల్‌ అధికారి, ఇరిగేషన్‌ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ బి. బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికకు సంబంధించి తాజాగా కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా నోటిఫికేషన్‌ జారీ చేశారు.

కర్నూలు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) డిస్ర్టిబ్యూటరీ కమిటీ (డీసీ)లకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు 17వ తేదీ మంగళవారం ముగిశాయి. ఎల్లెల్సీ పరిధిలో హోళగుంద డీసీ-1, కౌతాళం డీసీ-2, కోసిగి డీసీ-3, పెద్దకడుబూరు డీసీ-4, ఎమ్మిగనూరు డీసీ-5, 6, గోనెగండ్ల డీసీ-7, కోడుమూరు డీసీ-8, కర్నూలు డీసీ-9, 10 అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. పది మంది డీసీ అధ్యక్షులు సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక జరగాలంటే కనీసం ఐదుగురు హాజరు కావాలి. అలాగే గాజులదిన్నె ప్రాజెక్టు కమిటి పరిధిలో 12 మంది డబ్ల్యూయూఏలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో కనీసం 50 శాతం అంటే ఆరుగురు డబ్లూయూఏల అధ్యక్షులు హాజరు కావాలని ఎన్నికల నిర్వహణ అధికారులు పేర్కొంటున్నారు. మరో పక్క..

అధిష్ఠానం ఆశీస్సులు ఎవరికో..?

టీబీపీ-ఎల్లెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టు కమిటీ (పీసీ) చైర్మన్‌ ఎవరన్నది టీడీపీ వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఈ రెండు పీసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపికలో మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌చార్జిల ఏకాభిప్రాయం నిర్ణయం ఎంతో కీలకం. అయితే జిల్లాలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు, 195 గ్రామాలకు తాగునీరు అందించే ఎల్లెల్సీ పీసీ చైర్మన్‌ పీఠం కోసం హొళగుంద డీసీ అధ్యక్షుడు మిక్కిలినేని వెంకట శివప్రసాద్‌, కౌతాళం డీసీ అధ్యక్షుడు పి.టిప్పుసుల్తాన్‌, పెద్దకడుబూరు డీసీ అధ్యక్షుడు నరవ రమాకాంత్‌ రెడ్డి, ఎమ్మిగనూరు డీసీ-6 అధ్యక్షుడు గోవర్దన్‌ రెడ్డి, కర్నూలు డీసీ-9 అధ్యక్షుడు కే.మహేశ్వరరెడ్డిలు ఎల్లెల్సీ పీసీ చైర్మన్‌ స్థానాన్ని ఆశిస్తున్నారు. పోటీ అధికంగా ఉండటంతో చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి వదిలేశారు. అధినేత సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఉన్న వారే చైర్మన్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో పీసీ పీఠం ఎవరికి దక్కుతుందా? అన్న ఆసక్తి నెలకొంది.

జీడీపీ పీసీ చైర్మన్‌ కేఈకేనా?

గాజులదిన్నె ప్రాజెక్టు కమిటీ పరిధిలో 12 డబ్ల్యూయూఏలు ఉన్నారు. పీసీ చైర్మన్‌గా కోడుమూరు డబ్ల్యూయూఏ-2 అధ్యక్షుడు కేఈ మల్లికార్జున గౌడు పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కృష్ణగిరి మండలం పోతుగల్లు డబ్ల్యూయూఏ అధ్యక్షుడు సోములగౌడు కూడా ఆశించినా, మల్లికార్జున గౌడుకే ముఖ్యమైన నాయకులు మద్దతు ఇవ్వడంతో ఆయన ఎంపిక లాంఛనమే అని టీడీపీ వర్గీయులు అంటున్నారు. ఈ విషయంపై శుక్రవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అధినేత నిర్ణయమే ఫైనల్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు అర్బన్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లా సాగునీటి సంఘం అధ్యక్షుడి ఎంపిక అధినేత చంద్రబాబు నిర్ణయమే అంతిమమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి స్పష్టం చేశారు. గురువారం కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన టీసీ, డీసీ సభ్యులను, గెలుపునకు కృషి చేసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను సన్మానించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మద్దతు పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపికపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గాల వారీగా నాయకులు సూచించిన పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, టీడీపీ సీనియర్‌ నాయకులు ఎదురూరు విష్ణువర్దన్‌ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బి.వీరభద్రగౌడ్‌, ఎన్‌.రాఘవేంద్రరెడ్డి తదితరులను ఘనంగా సత్కరించారు.

Updated Date - Dec 19 , 2024 | 11:20 PM