ప్రశాంతంగా సాగునీటి సంఘం ఎన్నికలు
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:23 AM
ఆత్మకూరు మండలంలో మొత్తం 8 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 7 చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా ఒకచోట ఓటరు జాబితా సక్రమంగా లేకపోవడంతో ఎన్నిక వాయిదాపడింది.
ఆత్మకూరు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మండలంలో మొత్తం 8 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 7 చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా ఒకచోట ఓటరు జాబితా సక్రమంగా లేకపోవడంతో ఎన్నిక వాయిదాపడింది. కాగా ముందుగా వీఆర్‌ఎస్పీ- 1,2,3,4 సాగునీటి సంఘాలకు సంబంధించి ఒక్కోదానికి 12టీసీల చొప్పున ఎన్నికలు జరగ్గా అమలాపురం అశువాగు, ఇందిరేశ్వరం మాచా వీరప్ప చెరువు, కరివేన చెరువులకు సంబంధించిన సాగునీటి సంఘాలకు ఒక్కో దానికి 6టీసీల చొప్పున ఎన్నికలు జరిగాయి. అన్ని టీసీల్లో ఎన్నిక ఏకగ్రీవంగా జరగడంతో ఆయా సాగునీటి సంఘాల టీసీలు అధ్యక్షులును, ఉపాధ్యక్షులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. వీఆర్‌ఎస్పీ-1 అధ్యక్షుడిగా మల్లికార్జునరెడ్డి, ఉపాధ్యక్షుడిగా పఠాన్ యూసూఫ్, వీఆర్‌ఎస్పీ-2 అధ్యక్షుడిగా కేవీ రమణారెడ్డి, ఉపాధ్యక్షుడిగా లింగస్వామి, వీఆర్‌ఎస్పీ-3 అధ్యక్షుడిగా సోంపల్లి సుబ్బా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కర్నాట శ్రీరాములు, వీఆర్‌ఎస్పీ-4 అధ్యక్షుడిగా ఎ.సరస్వతి, ఉపాధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమలాపురం అసువాగు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా షేక్ ఇబ్రహీం, ఉపాధ్యక్షు డిగా చిన్నలింగన్న, ఇందిరేశ్వరం మాచా వీరప్ప చెరువుకు అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా రమేష్ యాదవ్, కరివేన చెరువుకు అధ్యక్షుడిగా ప్రదీప్ రావు, ఉపాధ్యక్షు డిగా చిన్నవీరన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్ని చోట్ల టీడీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా బైర్లూటిలోని గోసాయికట్ట చెరువుకు సంబంధించి ఓటరు జాబితా సక్రమంగా లేకపోవడం వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.
బండిఆత్మకూరు: మండలంలోని తెలుగుగంగ సాగు నీటి సంఘం-7కు పెద్దబాలన్ననాయక్, 8వ నెంబర్‌కు నాగశేషారెడ్డి, 9వ నంబర్‌కు మనోహర్‌చౌదరి, 10వ నంబర్‌కు లింగేశ్వరరావు, 11వ నంబరుకు ఈశ్వరరెడ్డి, 12కు షేక్ కలాం, 13కు విజయభాస్కర్, 14 సుబ్బలక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దదేవళా పురం ఎర్రచెరువుకు నాగలక్ష్మమ్మ, చిన్నదేవళాపురం తుమ్మల చెరువుకు ఎల్.వెంకటేశ్వర్లు, నారాయణాపురం బ్యాహ్మణచెరువుకు పాల శంకర్, కొత్త చెరువుకు నారా యణ అలియాస్ పాపయ్య, సంతజూటూరు చందనపు చెరువు రామలింగారెడ్డి, లింగాపరం పోతచెరువు షేక్ బాబు, కొత్తచెరువుకు రామకృష్ణారెడ్డి, జీసీపాలెం నెమిళ్ళ కుంట చెరువుకు వెంకటసుబ్బయ్య, కడమలకాల్వ ప్రేమ చెరువుకు కళావతమ్మ, రామాపురం ఆముదాల చెరువుకు బాలిరెడ్డి. బండిఆత్మకూరు చిన్నచెరువుకు సుధాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కెసీకెనాల్ నీటిసంఘం 12కు సుజాత, 16కు రాజేశ్వరరెడ్డి, 18కు బి.సుబ్బారెడ్డి, 19కు హిందుశేఖర్‌రెడ్డి ఏకగ్రీవ ంగా ఎన్నికయ్యారు.
నంద్యాల రూరల్: మండలంలోని చివరి ఆయుకట్టుకు సైతం నీరు అందిస్తామని మిట్నాల గ్రామ సాగునీటి సంఘ అద్యక్షులు చిలుకూరి రవిబాబు తెలిపారు. నంద్యాల మండలంలో మైనర్ ఇరిగేషన్, కేసికెనాల్, ఎస్‌ఆర్బీసీ పరిదిలో 12 సాగునీటి సంఘాలు ఉన్నాయి. శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగునీటి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో కూటమి అభ్యర్థులు అన్ని సంఘాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. సాగునీటి సంఘాలు పలువురికి ఆనందాన్ని, మరి కొందరికి దుఖాన్ని మిగిల్చాయి. మేజర్ గ్రామపంచాయతీ అయిన అయ్యలూరు టీడీపీ అభ్యర్థి శంకరమ్మ తాను ప్రతిపాదించిన అభ్యర్థికి ఎన్‌వోసీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపి విజయానికి కృషి చేసిన అన్యాయమే జరిగిందని కన్నీరు పెట్టారు. పొలీసులు సమయం ముగిసింది అని చెప్పడంతో అక్కడ నుంచి వెనుదిగారు. ఈ తరహా ఘటన చాపిరేవుల గ్రామంలో సైతం జరిగింది.
నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఎంపీ డా.బైరెడ్డి శబరి వర్గాల మధ్య పోటీ జరిగింది. నియోజకవర్గంలోని 21 మేజర్, మైనర్ సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు సంఘాలకు మినహా మిగిలిన 17 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మిగిలిన నాలుగు స్థానాల్లో కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి, గువ్వలకుంట్ల చెరువుల నీటి సంఘాలకు కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిడ్తూరు మండలంలోని తలముడిపి, జలకనూరు చెరువులకు ఆయా గ్రామాల రైతులు అడ్డు చెప్పడంతో ఎన్నికలను బహిష్కరించారు. నియోజకవర్గంలోని జూపాడుబంగ్లాలో 5, కొత్తపల్లిలో 3, మిడ్తూరు మండలంలో 2, పాములపాడులో 3 సాగు నీటి సంఘాలకు చైర్మన్, వైస్ చైర్మన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవం అయిన అన్ని స్థానాలు ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారే కావడం విశేషం. అందులో 13 నీటి సంఘాలు ఏకగ్రీవం కాగా పగిడ్యాల మండలంలోని మూర్వకొండ, ముచ్చుమర్రి, పాములపాడు నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ముచ్చుమర్రి, మూర్వకొండ సాగునీటి సంఘాలకుఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. ఈ మూడింటిలో ఒకటి ఎంపీ వర్గం వారు కైవసం చేసుకోగా, మరో స్థానంలో ఎమ్మెల్యే వర్గం విజయం సాధించగా, పాములపాడులో చైర్మన్ ఎమ్మెల్యే వర్గానికి రాగా, వైస్ చైర్మన్‌గా ఎంపీ వర్గానికి చెందిన వారు కైవసం చేసుకున్నారు.
నందికొట్కూరు రూరల్: నందికొట్కూరు మండలం లో కేసీకెనాల్ మూడవ విభాగం మూరవకొండ నీటితీరువా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఇందులో గెలుపొందిన నాయకులను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, మాండ్ర శివానందరెడ్డి ఘనంగా సాన్మనించి అభినందించారు. అనంతరం నాయకులు కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే, మాండ్రలను గజమాలతో సన్మానించారు. నందికొట్కూరు మండలంలోని కేసీకెనాల్ మూడవ విభాగం కింద మద్దిగట్ల, బిజినవేముల, నాగటూరు, కొణిదేల, మూరవకొండ గ్రామాల కు చెందిన 12 టీసీలుగా విభజించారు. ఇందులో 12 టీసీ మెంబర్లకు గానూ 6 టీసీలకు ఎన్నికలు జరగగా, మిగిలిన ఆరు టీసీలు ఏకగ్రీవమయ్యాయి. రుద్రవరం చంద్రశేఖర్‌ను ప్రెసిడెంట్‌గా, మాదక్కగారి వెంకటనాయుడును వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ తదితరులు పరిశీలించారు.
బైరెడ్డి, మాండ్ర గ్రూపుల మధ్య పోటీ
నందికొట్కూరు మండల పరిధిలోని కేసీ కెనాల్ మూడో విభాగం మూరవకొండ నీటీతీరువా ప్రెసిడెంట్ ఎన్నికల్లో 12 టీసీలుండగా అందులో ఆరు టీసీలు ఏకగ్రీవం అయ్యాయి. బైరెడ్డి వర్గం వారు మూడు, మాండ్ర వర్గం వారికి మూడు టీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు టీసీలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు జరిగిన ఆరు టీసీలలో ఐదు టీసీలు మాండ్ర వర్గం కైవసం చేసుకోగా ఒక్కటి మాత్రమే బైరెడ్డి వర్గం గెలుచుకొంది. జూపాడుబంగ్లా: పారుమంచాల, వీరాపురం, తంగ డంచ, మండ్లెం చిన్ననీటి పారుదల చెరువులకు సంబం ధించి ఆరు టీసీల చొప్పున, కేసీ కాలువ 12 టీసీలను అధికార పార్టీ తెలుగుదేశం కైవసం చేసుకుంది. కేసీ కాలువ 5వ డీసీ అధ్యక్షుడిగా పరమేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడిగా చంద్రేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పారుమంచాల చెరువు అధ్యక్షుడిగా ఉమామహేశ్వరుడు, ఉపాఽధ్యక్షుడిగా చిన్నరంగస్వామి, అదే గ్రామంలో వీరా పురం చెరువు అధ్యక్షుడిగా మల్లికార్జునరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నాగేంద్రగౌడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండ్లెం చెరువు అధ్యక్షుడిగా సురేష్, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస రెడ్డి, తంగడంచ చెరువు అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కొత్తపల్లి: మండలంలో 54 టీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 47 టీసీలు ఏకగ్రీవం కాగా, 3 టీసీలకు ఎన్నికలు జరగగా, కోరం లేక 4 టీసీలు వాయిదా వేసినట్లు కొత్తపల్లి ఎన్నికల అధికారి ఎంపీడీవో మేరీ, గువ్వలకుంట్ల ఎన్నికల అధికారి సువర్ఛల తెలి పారు. శివభాష్యం ప్రాజెక్టు పరిధిలోని కొత్తపల్లి డబ్ల్యూయూఏ-5లో 12 టీసీలకుగాను 8 టీసీలు ఏకగ్రీవం కాగా, 4 టీసీలకు కోరం లేక వాయిదా పడ్డాయి. అలాగే గోకవరం డబ్ల్యూయూఏ-6లో 12 టీసీలూ ఏకగ్రీవ మయ్యాయి. అధ్యక్షుడిగా టి.షమీవుల్లా అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా కట్టుబడి నూర్ అహ్మద్ ఎన్నికయ్యారు. గువ్వలకుంట్ల డబ్ల్యూయుఏ-7లో 12 టీసీలకు గానూ 9 ఏకగ్రీవం కాగా, 3 టీసీలకు ఎన్నికలు జరగగా కోరం లేక వాయిదా పడ్డాయి. శివపురం ఈర్లచెరువు అధ్యక్షుడిగా మేకల శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా షేక్ షఫీవుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోకవరం మల్లెలమ్మ చెరువు అధ్యక్షుడిగా పోచా రమణారెడ్డి, ఉపాధ్యక్షుడిగా బీవీ శివారెడ్డి, గోకవరం మొండికట్ట చెరువు అధ్యక్షుడిగా చంద్రబాబు, ఉపాధ్యక్షుడిగా మాడుగుల శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పగిడ్యాల: ముచ్చుమర్రి, పగిడ్యాల, సంకిరేణిపల్లె, లక్ష్మాపురం, ప్రాతకోట గ్రామాలలోని కేసీ కాలువ పరిధిలో 12 టీసీలకు గానూ 10 టీసీలకు ఎన్నికలు జరిగాయి. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మల్యే జయసూర్య వర్గీయుల మధ్య పోటీ నెలకొంది. ఎంపీ వర్గీయులు 1,2,3 టీసీలు ఏకగ్రీవం చేసుకోగా, 4,5,8 టీసీలకు జరిగిన ఎన్నికల్లో ఎంపీ వర్గీయులు గెలుపొందారు. 6,7,9, 12 టీలను ఎమ్మెల్యే వర్గీయులు ఏకగ్రీవం చేసుకున్నారు. 10వ టీసీకి సంబందించి ఒకే రైతు రావడంతో అక్కడ వాయిదా వేశారు. 11వ టీసీకి సంబంధించి నామినేషన్ వేసేందుకు ఇరువర్గీయుల వారు అలస్యంగా కేంద్రానికి రావడంతో పోలీసులు లోపలికి అనుమతించలేదు. చెర్మన్, వైస్ చెర్మన్ పదవుల కోసం ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు మధ్య వివాదం తలెత్తింది. వైస్ చెర్మన్ ఎమ్మెల్యే వర్గీయులకు ఇవ్వాలంటూ పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు చెర్మన్, వైస్ చెర్మన్ ఎన్నికలను బహిష్కరించి బయటకు వెళ్లారు. ఎంపీ వర్గానికి చెందిన ఆరుగురు టీసీలు కలిసి తలముడిపి చిన్నస్వామిని చెర్మన్‌గా, నాగేశ్వరరెడ్డిని వైస్ చెర్మన్‌గా ఎన్నుకున్నారు.
పాములపాడు: వేంపెంటలో నీటి సంఘం చైర్మన్‌గా ఆల్‌ఫ్రెడ్, వైస్ చైర్మన్‌గా లక్ష్మీశ్వర్, వాడాల చైర్మన్‌గా శంకర్, వైస్ చైర్మన్‌గా శ్రీనివాసులు, మద్దూరు చైర్మన్‌గా తిమ్మారెడ్డి, వైస్ చైర్మన్‌గా జయరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాములపాడు డబ్ల్యూయూఏ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల వర్గీయుల మధ్యే పోటీ నెలకొంది. ఎమ్మెల్యే వర్గంలో ఏడుగురు, ఎంపీ వర్గీయులు 5 మంది టీసీలు ఉన్నారు. కాగా ఎమ్మెల్యే వర్గానికి చెందిన నలు గురు అసమ్మతి టీసీలు ఎంపీ వర్గంవారితో చేతులు కలి పారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయుడు పింజరి చిన్న గోకారిని చైర్మన్‌గా, ఎంపీ వర్గీయుడు కురువ వెంకటేశ్వర్లును వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. కాగా ఈ ఎన్నికపై కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు మళ్లీ ఎన్నిక నిర్వహించారు. కాగా 8 ఓట్లతో మళ్లీ చిన్న గోకారి, వెంకటేశ్వర్లు గెలుపొందారు.
గడివేముల: మండలంలోని 5 నీటి సంఘాలకు గానూ అన్నిట్లో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొర్రపొలూరు నీటి సంఘం అధ్యక్షుడిగా శివశంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వేణుమాధవ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిందుకూరు కేసీ కెనాల్ నీటి సంఘం అధ్యక్షుడిగా పంట రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రాచమల్లు శివశంకర్, కొరటమద్ది కేసీ కెనాల్ నీటి సంఘం అధ్యక్షుడిగా యుగంధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పెద్ద అంక్కన్న, కరిమద్దెల కేసీ కెనాల్ నీటి సంఘం అధ్యక్షుడిగా ఈశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి, గడిగరేవుల ఎంఐ ట్యాంకు, కుందూ ఆయకట్టు నీటి సంఘం అధ్యక్షుడిగా అంగజాల శ్రీనివాసయాదవ్, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వెలుగోడు: వెలుగోడు పట్టణంలోని తెలుగుగంగా డబ్ల్యూయూఏ-1కు అధ్యక్షుడిగా నాగశేఖర్, ఉపాధ్యక్షుడిగా నాగరాజు, 2వ డబ్ల్యూయూఏకు అధ్యక్షుడిగా వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడిగా మహేంద్రనాథ్‌రెడ్డి, డబ్ల్యూయూఏ-3కు అధ్యక్షుడిగా మద్దెల శివశంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా చిన్నసత్యాలు, 4వ డబ్ల్యూయూఏకు అధ్యక్షుడిగా ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కుళాయిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డబ్ల్యూయూఏ-5కు అధ్యక్షుడిగా బ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యక్షుడిగా రాంపుల్లయ్య, 6కు అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కేసీసీ 11కు అధ్యక్షుడిగా రామలింగారెడ్డి, ఉపాఽధ్యక్షుడిగా శ్రీరాములు, 17కు అధ్యక్షుడిగా ఆదినారాయణరెడ్డి ఉపాధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి, వెలుగోడు రామసముద్రం చెరువు అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈదుల చెరువుకు అధ్యక్షుడిగా తెలుగు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా అబ్దుల్ ఖదీర్, బోయరే వుల వీరసముద్రం చెరువు అధ్యక్షుడిగా రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, మోతుకూరు చెవిటి మల్లాలమ్మ చెరువు అధ్యక్షుడిగా బోయపెద్ద రాజు, ఉపాధ్యక్షుడిగా విష్ణువర్ధన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మహానంది: తమ్మడపల్లి ఇంజవాణి చెరువు అధ్యక్షుడిగా మలికిరెడ్డి వెంకటమహేశ్వరరెడ్డి, ఉపాఽధ్యక్షు డిగా సుబ్బయ్య, గోపవరం బైరవాణి చెరువు అధ్యక్షుడిగా కశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా గంగసాని బాల వెంకటరెడ్డి, గాజులపల్లి అంకిరెడ్డి చెరువు అధ్యక్షుడిగా నల్లసర్వ పుల్లయ్య, ఉపాధ్యక్షుడిగా బి. భాస్కర్‌రెడ్డి, బసావాపురం పెద్ద చెరువు అధ్యక్షుడిగా మంటినూనే అమీర్‌బాషా, ఉపాధ్యక్షుడిగా తోట చిన్నవెంకట సుబ్బయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు తెలుగుగంగ ప్రాజెక్టు లకు సంభంధించిన అధ్యక్షుడి, ఉపాధ్యక్షులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుక్కాపురం 16 నీటి సంఘం అధ్యక్షుడిగా నాగరాజు, ఉపాధ్యక్షుడిగా శివమౌళి, 15వ నీటి సంఘం అధ్యక్షుడిగా హరిప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా బోయ రామచంద్రుడు, 17వ నీటి సంఘం అధ్యక్షుడిగా కె.వెంకటేశ్వర్లు, ఉపాధ్య క్షుడిగా మంజులాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోపవరం-1 సాగునీటి సంఘం అధ్యక్షుడిగా చింతం క్రాంతికుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా నంద్యాల వీర శేఖర్‌రెడ్డి, గోపవరం-2 సాగునీటి సంఘం అధ్యక్షుడిగా అశోక్‌కుమార్‌రెడ్డి, ఉపాఽధ్యక్షుడిగా బి.మహేశ్వరుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గోస్పాడు: మండలంలోని ఆరు డబ్ల్యూయూఏలకు గానూ అన్ని ఏకగ్రీవమయ్యాయి. మండలం నుంచి అధ్యక్షులుగా కాటంరెడ్డి తులసీశ్వరరెడ్డి, శీలం భాస్కరరెడ్డి సుబ్బారావు, చంద్రశేఖర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చిన్న నాగిరెడ్డి, ఉపాధ్యక్షులుగా రామేశ్వరరెడ్డి, రామసుబ్బయ్య, మహేశ్వర రెడ్డి, విశ్వనాథరెడ్డి, శివరామరెడ్డి ఎన్నికయ్యారు.
ఎన్నికల బహిష్కరణ
మిడుతూరు: తలముడిపికి చెందిన ఎర్ర చెరువు, తలముడిపి, మంచాలకట్ట గ్రామాలకు చెందిన మద్దిలేరు చెరువు, జలకనూరు గ్రామానికి చెందిన మద్ది గుండం చెరువు, చింతలపల్లి, ఖాజిపేట గ్రామాలకు చెందిన పోచావాగు చెరువులకు నీటి సంఘం ఎన్నికలు నిర్వహిం చారు. మద్దిగుండం చెరువుకు చెందిన జలనూరు రైతులు ఎన్నికలను బహిష్కరించారు. మద్దిగుండం చెరువు నుంచి పక్క గ్రామాల నాన్ ఆయకట్టు రైతులు గత ఐదేళ్ల నుంచి అక్రమంగా నీటిని వాడు కోవడం వల్ల జలకనూరు గ్రామ రైతులకు చెరువు నీరు తగ్గి నష్టపోవడం వల్ల ఎన్నికలను బహిష్కరించినట్లు రైతులు తెలిపారు. న్యాయం జరిగిన తరువాత ఎన్నికలు జరపాలని జలక నూరు రైతులు పోలింగ్ కేద్రం వద్ద ఎన్నికలను బహిష్క రించి నిరసన వ్యక్తం చేశారు. తలముడిపిలో పోలింగ్ కేంద్రం వద్ద ఎర్రచెరువుకు చెందిన ఆయకట్టు రైతులు రెండు వర్గాలు ఏర్పడి పోలింగ్ కేంద్రం వద్ద ఒక వర్గం వారు ఎన్నికలు నిలిపివేయాలని, మరొక వర్గం వారు ఎన్నిలు జరపాలని ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతా వరణం ఏర్పడి మధ్యాహ్నం 12 గంటల సమయం అయినా నామినేషన్ వేయలేదు. డీఎస్పీ రామంజినాయక్, ఎస్‌ఐ ఓబులేసు తలముడిపి గ్రామం చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపారు. మతముడిపి, మంచాల కట్ట గ్రామాలకు చెందిన మద్దిలేరు చెరువుకు మంచాల కట్టకు చెందిన వంగాల మురళి మోహన్ రెడ్డిని చైర్మన్‌గా, శివమల్లయ్యను వైస్ చైర్మన్‌గా రైతులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చితలపల్లి, ఖాజిపేట గ్రామాలకు చెందిన పోచావాగు చెరువుకు ఖాజిపేటకు చెందిన కైప సీతారామి రెడ్డిని చైర్మన్‌గా, వెంకటేశ్వర్లును వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు.
Updated Date - Dec 15 , 2024 | 12:23 AM