పండుగలా పింఛన్ల పంపిణీ
ABN, Publish Date - Sep 01 , 2024 | 12:29 AM
మండలంలో పింఛన్ పంపిణీ చేపట్టారు.
పాములపాడు, ఆగస్టు 31: మండలంలో పింఛన్ పంపిణీ చేపట్టారు. పాములపాడులో కురువ ఎల్లయ్య, రమేశ్, ఎర్రగూడూరులో టీడీపీ నాయకులు బాలీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పింఛన్ పంపిణీ చేశారు. ఆర్డీవో దాస్, టీడీపీ నాయకులు కాకరవాడ చిన్న వెంకటస్వామి, తాటిపాడు నాగేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.
పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరై పంపిణీ చేశారు. మండలంలోని వేంపెంట గ్రామంలో ఇంటింటికి వెళ్లడంతో ఒక్కరోజు ముందే పించన్ల పండుగ వచ్చిందని ఓ వృద్ధుడు ఎమ్మెల్యేను కౌగిలించుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్డీవో దాస్, ఎంపీడీవో, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు టీడీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, లెనిన్‌బాబు, ఆదిరెడ్డి, మధుకృష్ణ, చంద్రశేఖర్, సురేంద్రనాఽథ్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, హఫీజ్, లింగేశ్వరగౌడ్, మహేశ్‌గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లాలో శనివారం ఎంపీ బైరెడ్డి శబరి పింఛన్ అందజేశారు. ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ ఏదో ఒక నిధులను మళ్లించి పింఛను అందజేసేవారని విమర్శించారు. రెండు, మూడురోజులైనా పింఛను అందించేవారుకాదని అన్నారు. ఎంపీడీవో నూర్జహాన్, టీడీపీ నాయ కులు నాగేశ్వరరావు, కాకరవాడ చిన్నవెంకటస్వామి, సైఫుద్దీన్, రషీద్ మియ్యా, సుభాన్, బాలనారాయణగౌడు, పల్లెశివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు రూరల్: మండలంలోని అల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే జయసూర్య పింఛన్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పింఛన్ పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, మండల ప్రత్యేక అధికారి ఆర్‌డీఏ పీడీ శ్రీధరెడ్డి, ఎంపీడీఓ శోభారాణి, ఈవోఆర్డీ సంజన్న, గ్రామ కార్యదర్శులు చంద్రశేఖర్, రవీంద్రబాబు పాల్గొన్నారు.
మిడుతూరు: మండలలోని చౌట్కూరు గ్రామంలో ఎనీఆ్టర్ భరోసా పింఛన్లను నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీఎన్‌ఎస్ రెడ్డి, ఈవోఆర్డీ ఫకృద్దీన్, పంచాతీ కార్యదర్శి సింగ్, నాయకులు సురేంద్రనాథ్ రెడ్డి, నరసింహ గౌడ్, నాయకులు పాల్గోన్నారు.
నందికొట్కూరు: పట్టణంలో పింఛన్ అందజేశారు. మున్సిపల్ కమిషనర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ అధికారులు పంపణీ చేశారు.
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. శనివారం పింఛన్ల సొమ్ము అందకపోతే సోమవారం అందజేస్తామని అధికారులు వెల్లడించారు.
వెలుగోడు: మండలంలో పింఛన్ పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 6531 మందికి గానూ 6049 మందికి పింఛన్లను అందించి 93శాతం పూర్తి చేశారు. కార్యక్రమాల్లో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మహానంది: మహానంది మండలంలో 94.84 శాతం పింఛన్ పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రత్యేకాధికారి మురళీకృష్ణ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలను పరిశీలించారు. బుక్కాపురం, మహానంది గ్రామాల్లో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరి రామలింగారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: మండలంలోని ఎ.కోడూరు గ్రామంలో సచివాలయ అధికారులు పంపిణీ చేస్తున్న ఫింఛన్ల అందజేతను కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. సంతజూటూరు గ్రామంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి అబ్దుల్ రహెమాన్ పింఛన్ల పంపిణీ పరిశీలించి, లబిఽ్ధదారులకు ఫింఛన్లు అందజేశారు. మండలంలో 94 శాతం పంపిణీ చేసినట్లు ఎంపీడీవో వాసుదేవగుప్తా తెలిపారు. బి.కోడూరు గ్రామంలో శ్రీశైలం ట్రస్ట్టుబోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ భరద్వాజశర్మ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
గడివేముల: మండలంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పింఛన్‌లు పంపిణీ చేశారు. మండలంలో 5,743 మంది లబ్ధిదారులు ఉండగా 5,335 మంది లబ్ధిదారులకు పింఛన్‌లు అందజేసినట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.
Updated Date - Sep 01 , 2024 | 12:30 AM