పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం
ABN, Publish Date - Dec 16 , 2024 | 12:05 AM
ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయం అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయం అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పట్టణంలోని శ్రీ పొట్టిశ్రీరాములు సర్కిల్ వద్ద ఆదివారం మున్సిపల్ కమిషనర్ బేబి ఆధ్వర్యంలో 72వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని, టీడీపీ నాయకులు ముర్తుజావళి, ఆర్టు శ్రీను, మీనాక్షి, లింగమయ్య, జాన్ అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా(ఆంధ్రజ్యోతి): పొట్టిశ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగన్న, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): ఆంధ్రరాష్ట్ర అవతరణకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ఆత్మకూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భీమిశెట్టి కృష్ణమూర్తి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మంటపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో అడ్మినిస్ర్టేషన్ ఆఫీసర్ ఉమర్ అమరజీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది కళ్యాణ్ ఉన్నారు.
వెలుగోడు(ఆంధ్రజ్యోతి): టీడీపీ, జనసేన, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, అలాగే ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళి ఆర్పించారు. ఎంపీపీ రమేష్, ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది, టీడీపీ నాయకులు ఖలీల్, సంజీవరాయుడు, రాము, సుబ్రమణ్యం, జనసేన నాయకులు షాలుబాషా, ఆర్యవైశ్య నాయకులు బీవీ సత్యనారాయణ, నాగార్జున, ప్రసాద్, జనార్దన్, పరుచూరి కుమార్, రవి, మల్లికార్జున, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు పోరాటాన్ని, త్యాగనిరతిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రెడ్డి అన్నారు. పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆదివారం నందమూరినగర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో విద్యాలయ నిర్వాహకులు సుబ్బరాయుడు, రాజేశ్వరమ్మ, హాస్టల్ వార్డెన్ నాగలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
నంద్యాల కల్చరల్(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘము, నంద్యాల మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి ఆర్యవైశ్య సంఘం, వైశ్య యువజన సంఘం, అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతిపరిరక్షణ సమితి, మహిళామండలి, ఆర్యవైశ్య పరిరక్షణ సమితి, ఇతర సంఘాల ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖుల చేసి సంజీవనగర్ కూడలిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవఅధ్యక్షులు బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్తా, జిల్లా అధ్యక్షులు భవనాశి నాగమహేష్, ఆర్యవైశ్య పొలిటికల్ చైర్మన్ ఖండే శ్యామ్‌సుందర్‌లాల్, మహిళామండలి సభ్యులు, మున్సిపల్ వైస్‌చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, ప్రసాద్, ఇనుగూరి రమేష్, బిజెపి చంద్రశేఖర్, లాయర్ రావినూతల దుర్గాప్రసాద్, తదితరలు పాల్గొన్నారు.
పాణ్యం(ఆంధ్రజ్యోతి): పాణ్యంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వరలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ రమణయ్య, ఈవోఆర్డీ చంద్రమౌళీశ్వర గౌడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నంద్యాల క్రైం(ఆంధ్రజ్యోతి): అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని నంద్యాల పట్టణ డీఎస్పీ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆదివారం అమరజీవి వర్దంతి సందర్భంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పట్టణ డీఎస్పీ పి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్, నాగభూషణం, శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 16 , 2024 | 12:05 AM