నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయలు
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:52 PM
రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్సవ మూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై ఊరేగారు.
మంత్రాలయం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్సవ మూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై ఊరేగారు. ధనుర్మాసంలో భాగంగా ఆదివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో తుంగభద్ర నది తీరాన అశేఖ భక్త జనవాహిని తరలిరావడంతో మంత్రా లయం భక్తులతో కిక్కిరిసింది. ప్రధాన రహదారులపై రోడ్లన్నీ వాహ నాలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై విహరిస్తుండగా.. భక్తులు జయజయధ్వానాలు పలికారు. అనంతరం ఊంజల సేవ చేసి పీఠాధిపతి భక్తులను ఆశీర్వదించారు.
Updated Date - Dec 22 , 2024 | 11:52 PM