‘పదోన్నతి సమస్యలను పరిష్కరించాలి’
ABN, Publish Date - Nov 25 , 2024 | 01:00 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యా యుల పదోన్నతుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నంద్యాల, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యా యుల పదోన్నతుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలోని ఎస్పీజీ జూనియర్ కళాశాలలో ఏపీటీఎఫ్ అమరావతి జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశం నిర్వహించారు. సీవీ ప్రసాద్ మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయుల పదోన్నతులకోసం సర్వీస్ రూల్స్ తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయులను కేవలం బోధనకే పరిమితం చేయాలన్నారు. అనంతరం నంద్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా రవిప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా అశోక్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా నాగార్జున, అదనపు కార్యదర్శిగా వీరన్న, కోశాధికారిగా మౌలాలి, ఉపాధ్యక్షులుగా సుబ్బరాయుడు, సదాశివయ్య, బాలకోటిరెడ్డి, కార్యదర్శులుగా అల్తాఫ్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర నాయకులు సూర్యుడు, నాగూర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 01:00 AM