ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, Publish Date - Nov 02 , 2024 | 01:10 AM

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

పాణ్యంలో గ్యాస్‌ సిలిండర్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్‌ సలిండర్‌ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం దీపం ద్వారా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌లను దీపావళి కానుకగా ఇచ్చారు. మొట్టమొదట దీపం పథకాన్ని గతంలోనే టీడీపీ ప్రవేశపెట్టిందన్నారు. ప్రస్తుతం ఏటా మూడు సిలిండర్‌లను ఉచితంగా అందిస్తున్నామ న్నారు. మొదటి సిలిండర్‌కు మార్చి నెలా ఖరు వరకు సమ యం ఉంటుందన్నారు. పొదుపు గ్రూపు లను అభివృద్ధి చేసిన చంద్ర బాబు మహిళల కోసం మరింత కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారం లోకి వస్తూనే గ్యాస్‌ ధరలు పెంచారన్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని నాయకులు రాష్ట్రాన్ని పాలించిన ఖర్మ మనకు పట్టిందన్నారు. వైసీపీ జెండా రంగులతో కనబడుతున్న వ్యవసాయ కార్యాలయ రంగును మార్చాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ను మల్లెల కోరారు. అనంతరం పొదుపు మహిళా గ్రూపులకు రూ.32.50 లక్షల రుణాల చెక్కులను అందజేశారు. మండలంలో 13,360 గ్యాస్‌ కనెక్షలు ఉండగా దీపం పథకం కింద 4652 ఉన్నట్లు తహసీల్దారు నరేంద్ర నాథరెడ్డి తెలిపారు. ఎంపీపీ ఉశేన్‌బీ, టీడీపీ మండల కన్వీనర్‌ జయరామిరెడ్డి, సీఐ కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, ఎంపీటీసీలు రంగరమేష్‌, భాస్కర రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నందికొట్కూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళ పక్షపాతి అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని జైకిసాన్‌ పార్కులో దీపం-2 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తహసీల్దార్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు 1999 ఎన్నికల్లో గెలిచాక కట్టెల పొయ్యితో బాధపడుతున్న మహిళలకు దీపం కనెక్షన్‌ కింద గ్యాస్‌ కనెక్షన్‌లను ఇప్పించి పేద మధ్యతరగతి మహిళలు సహితం గ్యాస్‌ వినియోగానికి శ్రీకారం చుట్టిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలను మొదలుకొని ఉద్యోగుల వరకు దూరదృష్టితో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తున్నారన్నారు. మండల స్పెషల్‌ ఆఫీసర్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ బేబి, ఎంపీడీవో శర్మ, కౌన్సిలర్‌ భాస్కర్‌రెడ్డి, చిన్న రాజు, టీడీపీ నాయ కులు ముర్తుజావళి, షకీల్‌ అహ్మద్‌, లాయర్‌ జాకీర్‌, జమీల్‌, అబ్దుల్లా, వనజ, మీనాక్షి, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

ఆత్మకూరు: ఐదేళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పులు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆత్మకూరులోని తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో దీపం -2.0 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్ల లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళల్లో చైతన్యం తీసుకొచ్చింది చంద్రబాబేనని చెప్పారు. దీపం పథకం ద్వారా ఆనాడు మహిళల కష్టాలను తీర్చిన చంద్రబాబు నేడు దీపం-2.0 పథకం ద్వారా గ్యాస్‌ సిలిండర్లను సైతం ఉచితంగా అందించి అండగా నిలిచారని గుర్తుచేశారు. అనంతరం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ రత్నరాధిక, ఎంపీడీవో సుబ్రమణ్యం, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, డీటీ మనోహర్‌, సివిల్‌ సప్లయ్‌ డీటీ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు వంగాల శివరామిరెడ్డి, తిరుపమయ్య, వేణుగోపాల్‌, శివప్రసాద్‌ రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, గౌస్‌ లాజం ఉన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 01:10 AM