ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షం.. నష్టం

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:25 AM

బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు నందికొట్కూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మిడుతూరులో మొక్కజొన్న ధాన్యం చుట్టూ నీరు

నందికొట్కూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు నందికొట్కూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైన్లు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి వర్షపు నీరు వెళ్లడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రబ్బాని, మున్సిపల్‌ కమిషనర్‌ బేబి కలిసి హాజీ నగర్‌ లో నీట మునిగిన కాలనీలను పరిశీలించారు.

జూపాడుబంగ్లా: మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీవర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలో 72.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. పారుమంచాల వద్ద ప్రధాన రహదారిపై ఇసుకవాగు ఉప్పొంగి ప్రవహించింది. వాడాల, రేగడగూడూరు నుంచి నందికొట్కూరుకు ఉదయం వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో నందికొట్కూరు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు బస్సులు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు, రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మొక్క జొన్న రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ కన్నీరు మిగిలించింది. కల్లాల్లో ఆరేసిన పంటను కాపాడుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు.

Updated Date - Oct 18 , 2024 | 01:25 AM